Take a fresh look at your lifestyle.

గచ్చిబౌలిలో వాలంటరి బ్లడ్‌ ‌డొనేషన్‌ ‌క్యాంప్‌

‌శేరిలింగంపల్లి : స్థానిక నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్‌లోని గుల్మోహర్‌ ‌పార్క్ ‌కాలనీలో తెరాస నాయకులు భేరి రాంచందర్‌ ‌యాదవ్‌ ఆధ్వర్యంలో వాలంటరి బ్లడ్‌ ‌డొనేషన్‌ ‌క్యాంప్‌ను మియాపూర్‌ ఏసిపి కృష్ణ ప్రసాద్‌, ‌చందానగర్‌ ‌సీఐ రవీందర్‌లతో కలిసి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు పిలుపు మేరకు రక్త నిల్వలను పెంచడానికి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని, ప్రస్తుతం బ్లడ్‌ ‌బ్యాంకుల్లో రక్తం తగ్గిపోతుండడంతో తలసేమియా, ఇతరత్రా వ్యాధిగ్రస్తులకు రక్తం ఉపయోగపడుతుందని, పలువురు దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు.

ప్రమాదం జరిగినప్పుడు, ప్రసవ సమయంలో, అనారోగ్యం పాలైనప్పుడు రక్తం అవసరం చాలా ఉంటుందన్నారు. రక్తదానం చేయడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉన్న వారు ఎన్ని సార్లు రక్తదానం చేసినా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఎవరు కూడా భయపడకుండా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు గాంధీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్‌ ‌ఖాసీం, మహిళ అధ్యక్షురాలు రామేశ్వరమ్మ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply