Take a fresh look at your lifestyle.

‘‌విశ్వసుందరి’ హర్నాజ్‌ ‌కౌర్‌ ‌సంధు

భారత్‌ ‌నుంచి 21 సంవత్సరాల తర్వాత టైటిల్‌ ‌గెలుచుకున్న చండీఘఢ్‌ ‌యువతి.

ఇ‌జ్రాయెల్‌లోని ఈలాట్‌లో సోమవారం జరిగిన 70వ మిస్‌ ‌యూనివర్స్ ‌పోటీలో భారతదేశానికి చెందిన హర్నాజ్‌ ‌కౌర్‌ ‌సంధు కొత్త మిస్‌ ‌యూనివర్స్ 2021‌గా ఎన్నికైంది. సంధు కంటే ముందు భారత్‌ ‌నుంచి సుస్మితా సేన్‌, ‌లారా దత్తా మాత్రమే ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. 21 సంవత్సరాల తర్వాత మళ్లీ భారత్‌ ‌నుంచి నటి, మోడల్‌ అయిన హర్నాజ్‌ ‌సంధు 80 దేశాల నుండి పాల్గొన్న పోటీదారులను ఓడించి మిస్‌ ‌యూనివర్స్ 2021 ‌కిరీటాన్ని గెలుచుకుంది. సుస్మితా సేన్‌ 1994‌లో, లారా దత్తా 2000లో మిస్‌ ‌యూనివర్స్ ‌టైటిల్‌ ‌గెలుచుకున్నారు. అంటే హర్నాజ్‌ ‌పుట్టిన సంవత్సరం 2000లోనే చివరిసారిగా భారత్‌కు చెందిన యువతి ఈ టెటిల్‌ ‌గెలుచుకుంది. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన మిస్‌ ‌యూనివర్స్ 70‌వ ఎడిషన్‌లో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ఈ టైటిల్‌ను హర్నాజ్‌ ‌సొంతం చేసుకుంది. చండీగఢ్‌కు చెందిన మోడల్‌ ‌హర్నాజ్‌ ‌సంధు పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ ‌డిగ్రీని చేస్తున్నది. హర్నాజ్‌ ‌సంధుకు క్రితం సంవత్సరం 2020 విజేత మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా మిస్‌ ‌యూనివర్స్ ‌కిరీటాన్ని ధరింపజేసింది.

పరాగ్వే క్రీడాకారిణి నాడియా ఫెరీరా(22) రెండో స్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికాకు చెందిన 24 ఏళ్ల లాలెలా మస్వానే మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నాకు అంతటా మార్గనిర్దేశం చేసినందుకు, అండగా నిలిచినందుకు భగవంతుడికి, నా తల్లిదండ్రులకు మరియు మిస్‌ ఇం‌డియా సంస్థకు ఎంతో కృతజ్ఞురాలినని అంది. తమ ప్రార్థనలతో నాకు మిస్‌ ‌యూనివర్స్ ‌కిరీటం రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ ప్రేమను తెలియజేసింది. 21 ఏళ్ల తర్వాత అద్భుతమైన కిరీటాన్ని భారత్‌కు తీసుకురావడం గర్వించదగ్గ క్షణమని ఆమె అన్నారు. పోటీలో భాగంగా ఆఖరి ప్రశ్నోత్తరాల రౌండ్లో ‘ఒత్తిళ్లు ఎదుర్కునడంపై నేటి యువతకు మీరిచ్చే సలహా ఏమిటి? అన్న కీలక ప్రశ్నకు ఆమె ‘నేటి యువత ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య ఆత్మ విశ్వాసం లేకపోవడమే. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో విషయాల గురించి మాట్లాడండి. మీ జీవితానికి మీరే లీడర్‌. ‌మీ కోసం మీరు మాట్లాడండి నేను నన్ను నమ్ముకున్నాను కనుకనే నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను’’ అని సమాధానం చెప్పింది.

Leave a Reply