Take a fresh look at your lifestyle.

అటు ఆలయాల సందర్శన ఇటు అభివృద్ధి కార్యక్రమాలు

Visit these temples for further development harish rao

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మహా శివరాత్రి పండుగ నాడూ బిజీగా గడిపారు. అటు ఆలయాలను సందర్శించడంతో పాటు.. ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. మెదక్‌ ‌లో ఎడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నారు.నంగునూర్‌ ‌మండలం లోని ఖాతా గ్రామంలో మహాదేవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అలాగేనంగునూరు మండలంలోని బద్ధిపడగ గ్రామంలో రూ.16లక్షల వ్యయంతో నిర్మించిన 40వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్‌ ‌భగీరథ నీటి ట్యా0కు ప్రారంభించారు. అంతకు ముందు శ్రీ రాజ రాజేశ్వర దేవాలయానికి గుట్టపైకి వచ్చే దారి కోసం సుమారు రూ.20 లక్షల తో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు.

ఆ తర్వాత ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంగునూరు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.గట్లమల్యాలో గ్రామంలో రూ.3లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బస్‌ ‌షెల్టర్‌ ‌నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌ ‌రావు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు మహా శివరాత్రి వేడుకలలో భాగంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గట్ల మల్యాల గ్రామంలో రూ.20లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, అలాగే సామూహిక గొర్రెల షెడ్‌ ‌నిర్మాణాలకు మంత్రి హరీష్‌ ‌రావు శంకుస్థాపన చేశారు. సిద్దిపేటలో జరిగిన శివరాత్రి వేడుకల్లో,ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.