Take a fresh look at your lifestyle.

విశాఖ స్టీల్‌ను వెంకయ్యే కాపాడాలి

12న విజయవాడలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు
మిడియా సమావేశంలో సిపిఐ నేత నారాయణ
విశాఖపట్టణం,జూలై 9 : విశాఖపట్నంలో స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పోయిందంటే.. సిఎం తలపెట్టిన విశాఖ రాజధాని బోడిగుండు ద మ్లలెపూలు పెట్టినట్టుంటుందని సిపిఐ సీనియర్‌నేత నారాయణ ఎద్దేవా చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన, ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్‌ను కేంద్రం తెగనమ్ముతంటే సిఎం జగన్‌ ఎలా చూస్తూ ఊరుకుంటారని మండిపడ్డారు. శుక్రవారం నారాయణ డియాతో మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీనిపై చొరవ తీసుకోవాలని, సిఎం జగన్‌ ‌సారథ్యం వహించి పోరాడాలన్నారు. వివాఖ కోసం అవసరమైతే హరిబాబు గవర్నర్‌ ‌గిరి వద్దని అనాలన్నారు. అప్పుడే విశాఖ ఉక్కును కాపాడుకోగలమని అన్నారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకునే శక్తి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడుకి ఉందని ఆయన చొరవ తీసుకోవాలని, లేకపోతే ఆయన పశ్చాత్తాపపడాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గంటేనే విశాఖ ఉక్కును కాపాడుకోగలమని అన్నారు. పదే పదే ఉత్తరాలు రాస్తే సరిపోతుందా ? ప్రేమలేఖలకు ప్రధాన మంత్రి స్పందిస్తారా ? అని ప్రశ్నించారు. విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నప్పుడు ఉక్కు పరిశ్రమ ఉండాలి కదా.. బోడిగుండుకి మ్లలెపూలు కడతారా ? అని ఎద్దేవా చేశారు. హరిబాబు మిజోరాంకు గవర్నర్‌ అయ్యారని, ఇక్కడ పాపం చుట్టుకుంటే.. అక్కడ ఆయనకు పుణ్యం వస్తుందా ? అని అడిగారు.

హరిబాబుకు ఏమాత్రమైనా విశాఖపట్నంపై ప్రేమ ఉంటే.. తాను మిజోరాంకు గవర్నర్‌గా వెళ్లను అని విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ఉం‌టేనే వస్తాను అని చెప్పాలని అన్నారు. విశాఖలోనే పుట్టి పెరిగిన తాను విశాఖను శ్మశానంగా చేసుకొని మిజోరాంకు పోలేను అని హరిబాబు చెప్పాలని కోరారు. మన్మోహన్‌సింగ్‌ ‌ప్రభుత్వంలో ఎక్కువమంది మంత్రులు జైలుకుపోయారని, కానీ మోడి ప్రభుత్వంలో 28 మంది రూ.10 లక్షల కోట్లు ఎగ్గొట్టి పోయినవాళ్లేనని, వారంతా గుజరాత్‌కు చెందినవారని, విదేశాలకు పోయి మంచిగా స్థిరపడ్డారని విమర్శించారు. ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వాన కార్యాచరణ ప్రకటించాలని, స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రయివేటీకరణ నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకునేంతవరకు కార్యాచరణ ఉండాల్సిందేనని సిపిఐ నేత నారాయణ ఉద్ఘాటించారు. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్న పాలెం జంక్షన్‌ ‌వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 147వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని సీపీఐ నేత నారాయణ సందర్శించి సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు పోరాటంలో విద్యార్థి దశలోనే పాల్గొన్నానని అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి విశాఖ ఉక్కును కాపాడాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు అన్యాయం జరుగుతుంటే.. మాజీ ఎంపీ హరిబాబు స్పందించరా? అని నారాయణ ప్రశ్నించారు. నిజంగా విశాఖపై ప్రేమ ఉంటే మిజోరం గవర్నర్‌ ‌పదవి తిరస్కరించాలన్నారు. ఏ పోరాటానికైనా సీపీఐ సిద్ధంగా ఉందనీ, అన్ని పార్టీలూ స్పందించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ‌పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటం చేయాలన్నారు. సీఎం జగన్‌ ‌నేరుగా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్‌ ‌చేశారు. విజయసాయిరెడ్డి తలచుకుంటే సమస్య పరిష్కరించ గలరు. ఈ నెల 12న విజయవాడలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని నారాయణ అన్నారు.

Leave a Reply