Take a fresh look at your lifestyle.

విశాఖ స్టీల్‌ను ప్రైవటీకరించరాదు

ఎపి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
అమరావతి : ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ పట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే వ్యూహాలకు కేంద్రం పదును పెట్టడంతో దాన్ని వ్యతిరేకిస్తూ ఎపి అసెంబ్లీ తీర్మానించింది. ప్రైవేటీకరణ పక్రియపై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్‌ ‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా మంత్రి గుర్తు చేశారు. ఈ తీర్మానం అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నష్టాల్లో ఉందని, అమ్మేస్తామని కేంద్రం ప్రకటించడంతో.. దీనిని వ్యతిరేకిస్తూ కార్మికులు నిరాహార దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కేంద్రం వీసమెత్తు కూడా చలించలేదు. మనసు మార్చుకోలేదు. ఇవన్నీ ఒకఎత్తయితే.. మహారాష్ట్రలో కరోనా వల్ల పరిస్థితులు బాగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ‌ప్లాంటు నుంచి ఆక్సిజన్‌ను కూడా తరలించింది.

సొంత ప్రయోజనాలకు స్టీల్‌ప్లాంటును వినియోగించు కుంటున్న కేంద్రం, ఆంధ్రులు ప్రాణాలొడ్డి సాధించుకున్న ప్లాంటును ఎలా అమ్మేస్తుందని అప్పట్లో రాజకీయ పక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. మరో వైపు.. వైజాగ్‌ ‌స్టీల్స్ ‌టర్నోవర్‌ ‌రూ.18 వేల కోట్లు సాధించామని, కర్మాగారం చరిత్రలోనే రెండో అత్యధికమని మార్చి చివరి రోజున సీఎండీ పీకే రథ్‌ ‌వెల్లడించిన విషయం విదితమే.

Leave a Reply