Take a fresh look at your lifestyle.

విశాఖ స్టీల్‌ ‌ప్రైవేట్‌ ‌పరం కానివ్వం ..!

ఆగస్టు 2, 3 తేదీలలో జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ధర్నా
విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పరిరక్షణ పోరాట కమిటీ
విశాఖపట్నం స్టీల్‌ ‌ప్లాంట్‌ను ప్రయివేట్‌ ‌పరం చేయొద్దని, ప్రభుత్వ రంగ సంస్థగా విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ను కొనసాగించాలని స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు గత రెండు రోజులుగా ఢిల్లీలో వివిధ జాతీయ ప్రాంతీయ పార్టీల నాయకులను…ఉభయ సభల, ఫ్లోర్‌ ‌లీడర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిసి విజ్ఞప్తి పత్రం అందజేశారు. తమ ఢిల్లీ పర్యటన వివరాలు శనివారం ఆంధ్ర భవన్‌లో ప్రెస్‌ ‌మీట్‌ ఏర్పాటు చేసి ప్రింట్‌ అం‌డ్‌ ఎలక్ట్రానిక్‌ ‌మీడియాకి తెలిపారు. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ను రక్షించుకోడానికి జంతర్‌ ‌మంతర్‌లో ఆగస్టు 2, 3 తారీఖుల్లో ధర్నా చేయనున్నాని తెలిపారు. వొత్తిడి తెచ్చి ఆంధ్ర అసెంబ్లీలో జగన్‌ ‌ప్రభుత్వం తీర్మానం పెట్టేలాగా చేశామని. ఇక దేశవ్యాపిత ఆందోళన కోసం ఇక ఢిల్లీలో కూడా పోరాటం చేపడతామని స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పరి రక్షణ పోరాట కమిటీ సభ్యులు మీడియాకి తెలిపారు. విశాఖ స్టీల్‌ ‌ప్రభుత్వానికి లాభాలు అందించే సంస్థ అని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళామని విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పరి రక్షణ పోరాట కమిటీ సభ్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కుట్రతో విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ను ప్రయివేట్‌ ‌పరం చేస్తున్నదని స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌వారు తెలిపారు. పోరాట కమిటీ సభ్యులను వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను ఉభయ సభల, ఫ్లోర్‌ ‌లీడర్లను కలిపించటంలో స్వయంగా వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి సహకారం అందించి అందరిని కలిసేలాగా చూసారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ, తృణమూల్‌, ‌లెఫ్ట్ ‌పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు, జంతర్‌ ‌మంతర్‌లో జరుగబోయే స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుల ధర్నాలో పాల్గొంటామని హామీ ఇచ్చాయి. కమిటీ సభ్యులు మళ్ళీ ఢిల్లీ వొచ్చినప్పుడు రాష్ట్రపతిని, ఉప రాష్ట్రపతిని కలవటానికి నిర్ణయించుకున్నాయి. 2 లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ను కేవలం 32 వేల కోట్లకి కేంద్రం ఎందుకు అమ్మాలనుకుంటుందో కేంద్రం చెప్పాలని, ఈ విషయంలో ప్రతిపక్షపార్టీలన్నీ తమకు అండగా వున్నాయని స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు తెలిపారు. వైజాగ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌కి ఎందుకు గనులు ఇవ్వరని అడిగితే ఆర్ధిక శాఖ మంత్రి నిమ్మకు నీరెత్తి కూర్చున్నారని, స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌లేని గాలి జనార్దన్‌ ‌రెడ్డికి క్యాప్టివ్‌ ఐరన్‌ ‌తీసేలా గనులు ఇచ్చి వైజాగ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌లాభాల్లో ఉన్నా కూడా వైజాగ్‌కి గనులు ఇవ్వలేదని స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఆరోపించారు.

వైజాగ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ అప్పులు కేపిటల్‌లో కలపాలని, అలాగే కేప్టివ్‌ ఐరన్‌ ‌గనులు విశాఖ స్టీల్‌కి అలాట్‌ ‌చేయడం అనే రెండు పనులు చేస్తే వైజాగ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌మళ్ళీ కళకళ లాడుతుందని స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు చెప్పారు. ఈ పనులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తి కూర్చున్నది. జగన్‌ ‌ప్రభుత్వం మా పోరాటానికి అండగా నిలవాలని, ప్రతిపక్షం టీడీపీ కూడా వైజాగ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌కాపాడుకునే పోరాటంలో ముందుడాలని కోరారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రాకి అన్యాయం జరిగిందని, ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్న భారీ పరిశ్రమను కేంద్రం లాగేసుకుంటే ఒప్పుకునేది లేదని పోరాట కమిటీ సభ్యులు వెల్లడించారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు తమ రాజీనామాలపై స్వయంగా నిర్ణయం తీసుకోవాలని వారు అన్నారు. అత్యధిక టాక్స్ ‌కట్టే విశాఖ స్టీల్‌ను అంబానీ, అదానీకి అప్పనంగా కేంద్రం ఇస్తే ఊరుకునేది లేదని విశాఖ ఉక్కును రక్షించుకోడానికి ఢిల్లీలో మహా సంగ్రామం చేపట్టి దేశవ్యాపిత ఆందోళనకు దిగుతామని స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పరి రక్షణ పోరాట కమిటీ సభ్యులు ప్రకటించారు.

Leave a Reply