Take a fresh look at your lifestyle.

విశాఖ ఉక్కు.. చేజారుతున్న ఆంధ్రుల హక్కు ..!

“స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన అతి పెద్ద ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని గొంతెత్తి, తెన్నేటి విశ్వనాథం ఆధ్వర్యంలో తెలుగు వాళ్ళు చేసిన నినాదాలు అలల ఘోషతో పోటీపడ్డాయి. రాజీపడని, అలుపెరగని ఆ పోరాటం సాగరతీరాన తొలి ఉక్కుకర్మాగారానికి పురుడు పోసింది. కేంద్రం పూర్తిస్థాయి నిధులతో నిర్మాణమైన ఆ కర్మాగారం…విశాఖ రూపురేఖలను మార్చివేసింది. లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అభివృద్ధి ప్రారంభమై…రాష్ట్రమంతా విస్తరించింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. స్టీల్‌ ప్లాంట్‌ను, విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది ఫ్యాక్టరీ. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ నినదించిన స్వరాలు ఇంకా సాగర తీరంలో మారుమోగుతూనే ఉన్నాయి..”

  • ప్రైవేటీకరణ నిర్ణయంతో దిక్కు తోచని ఆంధ్ర ప్రదేశ్
  • స్టీల్ ప్లాంటు కోసం విశాఖ ఎంపికలో నీలం, కాసు కీలక పాత్ర

1966 లో ఆంధ్రప్రదేశ్ అంతటా ఉవ్వెత్తున మొదలైంది విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఆందోళన. ఉద్యమం అనతికాలలంలో ఊపందుకుని ఆ ఏడాది నవంబర్ ఒకటో తేదీ.. విశాఖపట్నంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు విద్యార్థులు, మరో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆ రోజు విశాఖతో పాటు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు. 55 సంవత్సరాల మూడునెలలకిందట ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో చేపట్టిన ఉద్యమంలో జరిగిన ఘటనది. తర్వాత మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం కర్మాగారం ఏర్పాటును ప్రకటించింది. 1971లో శంకుస్థాపన చేస్తే.. రెండు దశాబ్దాల తర్వాత పూర్తిస్థాయి పని ప్రారంభించింది. 1971న నాటి ప్రధాని ఇందిరా గాంధీ విశాఖ ఉక్కు పరిశ్రమకు శంఖుస్థాపన చేశారు. ఆమె మరోసారి ప్రధానిగా ఉండగానే 1981 నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రారంభమై ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.

అటువంటి విశాఖ ఆయువుపట్టు సడలుతోందా? ఉక్కు పిడికిలి బిగించి తెలుగు వాడు సాధించిన ఉక్కు కర్మాగారం ఉట్టిదైపోతోందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి కేంద్రంగా నిలిచిన ఉక్కు పరిశ్రమ.. పెట్టుబడుల ఉపసంహరణ వేటలో చిక్కి శల్యమై పోతోందా? తాజా పరిణామాలను గమనిస్తే.. ఇదే నిజం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వంద శాతం ప్రయివేటీకరిస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆరు దశాబ్దాలుగా విశాఖ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉక్కు పరిశ్రమ మనుగడపై… నీలినీడలు కమ్ముకున్నాయి.

చరిత్రలోకి వెళితే..

1964 శీతాకాల సమావేశాల్లో పరిశ్రమల ప్రణాళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగినపుడు, ‘‘పరిశ్రమల విషయంలో మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని సరిచేయటానికి ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొల్పాలి. అలా నెలకొల్పే వరకూ అసమతుల్యత తొలగిపోదు. రాష్ట్రాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు’’ అని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆ డిమాండ్‌కు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు పి.వెంకటేశ్వర్లు (సీపీఐ), టి.నాగిరెడ్డి (సీపీఎం), జి.లచ్చన్న (స్వరాజ్య), తెన్నేటి విశ్వనాథం (నేషనల్ డెమొక్రాట్స్), వావిలాల గోపాల కృష్ణయ్య (ఇండిపెండెంట్) తదితరులు మద్దతిచ్చారు.

visakha hukku andhrula hakku

అయితే.. ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం మీద మొదట హిందుస్తాన్ స్టీల్ ఇచ్చిన నివేదిక.. విశాఖపట్నానికి అనుకూలంగా లేదు. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నారు. ఆయన.. 1965 జనవరి 27న బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం (బీఏఎస్ఐసీ – బేసిక్) పేరిట ఒక సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించారు. ఉక్కు పరిశ్రమను స్థాపించటానికి అనువైన ప్రదేశం గురించి నిష్పాక్షిక నిపుణుల అభిప్రాయం తెలుసుకోవటం ఆ కన్సార్షియం ఏర్పాటు లక్ష్యం. ఇది ఆరు వేర్వేరు స్థలాలు విశాఖపట్నం, బైలదిలా, గోవా, హోస్పేట్, సేలం, నైవేలీలను పరిశీలించింది. ఆ బృందం 1965 జూన్ 25వ తేదీన సమర్పించిన నివేదికలో దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. సముద్ర తీరంలో అత్యంత అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నమని తేల్చింది. భూమి మీద హోస్పేట చాలా అనువైన స్థలమని పేర్కొంది. ఈ రెండు స్థలాల మధ్య ముడి సరకు రవాణాకు దూరం దగ్గరగా ఉండడంతో పాటు.. ఓడరేవు కూడా ఉన్న విశాఖపట్నం అన్ని విధాలా అనువైన ప్రాంతమని స్పష్టంచేసింది.

విశాఖ ఉక్కు కర్మాగారం….
స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన అతి పెద్ద ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని గొంతెత్తి, తెన్నేటి విశ్వనాథం ఆధ్వర్యంలో తెలుగు వాళ్ళు చేసిన నినాదాలు అలల ఘోషతో పోటీపడ్డాయి. రాజీపడని, అలుపెరగని ఆ పోరాటం సాగరతీరాన తొలి ఉక్కుకర్మాగారానికి పురుడు పోసింది. కేంద్రం పూర్తిస్థాయి నిధులతో నిర్మాణమైన ఆ కర్మాగారం…విశాఖ రూపురేఖలను మార్చివేసింది. లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అభివృద్ధి ప్రారంభమై…రాష్ట్రమంతా విస్తరించింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. స్టీల్‌ ప్లాంట్‌ను, విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది ఫ్యాక్టరీ. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ నినదించిన స్వరాలు ఇంకా సాగర తీరంలో మారుమోగుతూనే ఉన్నాయి.

visakha hukku andhrula hakku

స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన అతి పెద్ద ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని తెలుగు వారు చేసిన నినాదాలు అలల ఘోషతో పోటీపడ్డాయి. రాజీపడని, అలుపెరగని ఆ పోరాటం సాగరతీరాన తొలి ఉక్కుకర్మాగారానికి పురుడు పోసింది. కేంద్రం పూర్తిస్థాయి నిధులతో నిర్మాణమైన ఆ కర్మాగారం…విశాఖ రూపురేఖలను మార్చివేసింది. లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అభివృద్ధి ప్రారంభమై…రాష్ట్రమంతా విస్తరించింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. స్టీల్‌ ప్లాంట్‌ను, విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది ఫ్యాక్టరీ.

22వేల ఎకరాల సువిశాల స్థలంలో ఫ్యాక్టరీ నిర్మించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో 18వేలమంది శాశ్వత ఉద్యోగులు, 20వేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఫ్యాక్టరీ నిర్మితమైన తొలి సంవత్సరాల్లో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాతికాలంలో ఆ ఇబ్బందులను అధిగమిస్తూ..ఎవరూ ఊహించనిరీతిలో అభివృద్ధి చెందింది. 2002వ సంవత్సరం నుంచి 2015 వరకు కోట్ల రూపాయల లాభాలు ఆర్జించింది. 2003 నుంచి 2009 వరకు ఏటా వెయ్యికోట్లకు పైగా లాభాలు నమోదు చేసింది. అయితే 2015 తర్వాత మూడేళ్ల పాటు ఉక్కు ఫ్యాక్టరీని నష్టాలు వెంటాడాయి. తర్వాతి ఏడాది 2018-19లో మాత్రం 97కోట్ల లాభం సాధించింది.

కానీ గడచిన ఆర్ధిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ భారీ నష్టాలు చవిచూసింది. ఈ ఒక్క ఏడాదే 3వేల కోట్లకు పైగా నష్టం నమోదు చేసింది.దేశానికే గర్వకారణమైన అతి పెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర పెద్దలు వడివడిగా అడుగులు వేస్తుండడంతో ఉక్కు నగరం ఉలిక్కి పడుతోంది. విశాఖకు స్టీల్ సిటీ అన్న పేరు రావడానికి కారణమైన స్టీల్ ప్లాంట్ ను నూటికి నూరు శాతం ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం కార్మిక సంఘాలలో ఆందోళన రేపుతున్నాయి

సాగర తీరంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం దేశంలో ఇదే. స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం సొంత గనులు లేకపోవడం. ముడి ఇనుము, బొగ్గు ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లకు అధికమొత్తంలో ఖర్చుచేయాల్సి రావడం స్టీల్‌ప్లాంట్‌పై పెనుభారం మోపుతోందని వినిపిస్తున్నదీ. ఆధునికీకరణ, విస్తరణ వల్ల కూడా ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. దీనికి తోడు ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సెగలు కూడా తాకాయి. ప్రపంచ ఉక్కు దిగ్గజ సంస్థ అయిన పోస్కో తమ కార్మాగారాన్ని స్టీల్ ప్లాంట్ ఆవరణలో నిర్మిస్తుందన్న ప్రచారం జరిగింది. పోస్కో ప్రతినిధులు కొందరు స్టీల్‌ప్లాంట్‌ను పలుమార్లు సందర్శించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది.

స్టీల్ ప్లాంట్ కింద ఉన్న కొన్ని ఎకరాలను పోస్కోకు కేటాయిస్తారన్న వార్తలపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమయింది. ఈ క్ర‌మంలో సంస్థ‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా అధికారులు బోర్డు అనుమతి కూడా ఇచ్చింది. విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి కావడంతో ఫ్యాక్ట‌రీ భూముల విలువ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం భూములు, ప్లాంట్‌ విలువ కలిపితే రూ.లక్ష కోట్లకు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా.

నందిరాజు రాధా కృష్ణ

Leave a Reply