Take a fresh look at your lifestyle.

ఈ ఏడాది భయంకర ఘటనలు చూడాల్సి వస్తోంది..!

  • విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై కేసీఆర్, కేటీఆర్ స్పందన..గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరం
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

‌విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించారు.ఈ ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్లు కేసీఆర్ తెలిపారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు.

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటన గురించి తెలుసుకుని విస్మయానికి గురయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాలా భయంకర ఘటనలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply