Take a fresh look at your lifestyle.

విదేశాల్లో ఉన్న .. 276 మంది భారతీయులకు వైరస్‌

లెక్‌సభకు వెల్లడించిన విదేశాంగ శాఖన్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న 276 మందికి కరోనా సోకినట్లు ఇవాళ కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఆ శాఖ ఈ సమాధానం ఇచ్చింది. ఇరాన్‌లో 255 మంది, యూఏఈలో 12 , ఇటలీలో అయిదుగురు, హాంగ్‌కాంగ్‌, ‌కువైట్‌, ‌రువాండా, శ్రీలంకల్లో ఒక్కొక్కరికి వైరస్‌ ‌సోకినట్లు ప్రకటనలో తెలిపారు. అయితే వైరస్‌ ‌సోకిన వారు ప్రయాణం చేయకూడదు అన్న నిషేధం ఉన్నది.

వైరస్‌ ‌సోకిన వాళ్లు ఆ దేశంలోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అనేక దేశాలకు భారత్‌ ‌వీసాలను రద్దు చేసింది. బ్రిటన్‌, ఈయూ, మలేషియా నుంచి వస్తున్న వారిపై ట్రావెల్‌ ‌బ్యాన్‌ ‌విధించింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!