Take a fresh look at your lifestyle.

వర్చువల్‌గా భారత్‌-‌సింగపూర్‌ ‌మధ్య యుపిఐ-పేనౌ లింకేజీ

‌హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 21 : యుపిఐ-పేనౌ లింకేజి అనేది దేశాంతర లావాదేవీలను సులభతరంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, వాస్తవ కాల ప్రాతిపదిక కలిగినవిగా మార్చివేయనుంది. భారతదేశానికి, సింగపూర్‌కు మధ్య ఒకటో క్రాస్‌-‌బార్డర్‌ ‌లావాదేవీని నిర్వహించిన ఆర్‌బిఐ గవర్నరు, ఎమ్‌ఎఎస్‌ ఎమ్‌డి, భారతదేశానికి చెందిన యునైటెడ్‌ ‌పేమెంట్స్ ఇం‌టర్‌ ‌ఫేస్‌ (‌యుపిఐ)కి, సింగపూర్‌కు చెందిన పేనౌకు మధ్య రియల్‌ ‌టైమ్‌ ‌పేమెంట్‌ ‌లింకేజిని వర్చువల్‌ ‌మాధ్యమం ద్వారా ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సింగపూర్‌ ‌ప్రధాని లీ సీన్‌ ‌లూంగ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నరు శక్తికాంత్‌ ‌దాస్‌తో పాటు మానిటరి ఆథారిటి ఆఫ్‌ ‌సింగపూర్‌ ‌యొక్క మేనేజింగ్‌ ‌డైరెక్టరు రవి మేనన్‌ ‌వారి వారి మొబైల్‌ ‌ఫోన్‌లను ఉపయోగిస్తూ ఒకరితో మరొకరు లైవ్‌ ‌క్రాస్‌ ‌బార్డర్‌ ‌లావాదేవీని పూర్తి చేశారు.

క్లాస్‌ ‌బార్డర్‌ ‌పర్‌ ‌సన్‌ ‌టు పర్‌ ‌సన్‌(‌పి2పి) చెల్లింపు సదుపాయాన్ని ప్రవేశ పెట్టిన ఒకటో దేశంగా సింగపూర్‌ ‌నిలచింది. ఈ సదుపాయం సింగపూర్‌లో ఉంటున్న భారతీయ సముదాయానికి, ప్రత్యేకించి ప్రవాసి శ్రమికులకు/విద్యార్థులకు సహాయకారి కాగలదు. అంతేకాకుండా, భారతదేశం నుండి సింగపూర్‌కు, సింగపూర్‌ ‌నుండి భారతదేశానికి వెనువెంటనే తక్కువ ఖర్చుతో డబ్బును బదలాయించే మాధ్యం ద్వారా డిజిటలీకరణ, ఇంకా ఫిన్‌ ‌టెక్‌ల ప్రయోజనాలను సామాన్య మానవుల చెంతకు చేర్చుతుంది. క్యుఆర్‌ ‌కోడ్‌ ‌యొక్క మాధ్యం ద్వారా యుపిఐ చెల్లింపులను స్వీకరించడం అనేది సింగపూర్‌లో ఎంపిక చేసిన కొన్ని మర్చంట్‌ అవుట్‌ ‌లెట్‌లలో ఇప్పటికే అందుబాటు లో ఉంది.

వర్చువల్‌ ‌మాధ్యమం ద్వారా ఈ తరహా ప్రారంభ కార్యక్రమం నిర్వహణకు పూర్వమే ఇరువురు ప్రధాన మంత్రుల మధ్య టెలిఫోన్‌ ‌ద్వారా సంభాషణ చోటుచేసుకొంది. ఆ సంభాషణలో భాగంగా పరస్పర హితం ముడిపడ్డ రంగాలను గురించినటువంటి చర్చలు జరిగాయి. భారతదేశం-సింగపూర్‌ ‌సంబంధాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రధాని లీ సీన్‌ ‌లూంగ్‌ ‌యొక్క భాగస్వామ్యానికి గాను ప్రధాన మంత్రి ధన్యవాదాలను తెలియ జేశారు. జి20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత కాలంలో లీ సీన్‌ ‌లూంగ్‌తో కలసి పనిచేయాలని ఆశిస్తున్నా నని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Leave a Reply