Take a fresh look at your lifestyle.

డెల్టాప్లస్‌ ‌వ్యాప్తితో అప్రమత్తంగా ఉండాలి

  • పండగలు, జాతరలకు దూరంగా ఉంటేనే మంచిది: రాష్ట్ర హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు
  • సెకండ్‌ ‌వేవ్‌ ఇం‌కా సమసిపోలేదు..అప్రమత్తంగా ఉండాలి : కేంద్ర ఆరోగ్య శాఖ
  • థర్డ్‌వేవ్‌ ఉధృతి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించిన వైరాలజిస్టులు

డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో జనం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు అన్నారు. థర్డ్ ‌వేవ్‌ ‌రావటం అనేది జనం చేతుల్లోనే ఉందన్నారు. ఇంకా మనం సెకండ్‌ ‌వేవ్‌ ‌లోనే ఉన్నామని.. డెల్టా వేరియంట్‌ ‌కొనసాగుతుందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నందున జనం పండుగలు, సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ఇక టీకా 50శాతం లోపు కవరైన జిల్లాల్లో మొదటి డోస్‌ ‌పై ఫోకస్‌ ‌చేశామన్నారు. ప్రస్తుతం 10 లక్షల వరకు కోవిషిల్డ్ ‌డోసులు ఉన్నాయని..టీకా అయిపోతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలావుంటే పల్లెల్లో మళ్లీ కొరోనా టెన్షన్‌ ‌మొదలైంది. జగిత్యాల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతుండడంతో స్వచ్ఛందంగా గ్రామాల ప్రజలు సెల్ఫ్ ‌లాక్‌ ‌డౌన్‌ ‌పాటిస్తున్నారు. వైరస్‌ ‌విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వెల్గటూర్‌ ‌మండలం ఎండపల్లి, మద్దుట్లలో కొరోనా కేసులు పెరగడంతో లాక్‌ ‌డౌన్‌ ‌విధించారు. ఆగస్టు ఫస్ట్‌తో లాక్‌ ‌డౌన్‌ని ఎత్తివేశారు. కొరోనా థర్డ్ ‌వెవ్‌ ‌భయంతో సెల్ఫ్ ‌లాక్‌ ‌డౌన్లతో గ్రామాలు కట్టడి చేస్తున్నాయి.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెలుగుమట్లలో స్వచ్ఛంద లాక్డౌన్‌ ‌విధించారు. ఫిజికల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించాలన్నారు. మాస్కు లేకుండా బయటకి రావొద్దని సూచించారు. రూల్స్ ‌బ్రేక్‌ ‌చేస్తే వేయ్యి రూపాయల ఫైన్‌ ‌విధిస్తామని తెలిపారు. మరోవైపు కొరోనా థర్డ్ ‌వేవ్‌పై ప్రముఖ మైక్రో బయాలజిస్ట్, ‌వైరాలజిస్ట్ ‌ప్రొఫెసర్‌ ‌గగన్‌దీప్‌ ‌కాంగ్‌ ‌హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోతే అసలు మూడో వేవ్‌లో ఎన్ని కేసులు వొస్తాయో ఊహించడం కూడా కష్టమేనని అన్నారు. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌నిటారు పర్వతమైతే.. మూడో వేవ్‌ ఓ ‌పెద్ద కొండ అని ఆమె అభిప్రాయపడ్డారు. అసలు థర్డ్ ‌వేవ్‌లో ఎన్ని కేసులు వస్తాయో ఎవరూ ఊహించలేరని ఆమె చెప్పడం గమనార్హం. వైరస్‌ ఇలాగే మ్యుటేట్‌ అవుతూ, మరింత ప్రమాదకరంగా మారుతుంటే కేసుల సంఖ్య అంచనా వేయడం కష్టమని గగన్‌దీప్‌ ‌కాంగ్‌ అన్నారు. ఇక కేరళలో కేసుల సంఖ్య పెరగడం ప్రభుత్వ వైఫల్యమా అని ప్రశ్నించగా.. కాదని సమాధానమిచ్చారు. అయితే నెమ్మదిగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌, ‌తగిన యాంటీబాడీలు లేకపోవడం కారణంగా కేసుల సంఖ్య పెరుగుతుందన్న వాదనను ఆమె అంగీకరించారు.

సెకండ్‌ ‌వేవ్‌ ఇం‌కా సమసిపోలేదు..అప్రమత్తంగా ఉండాలి : కేంద్ర ఆరోగ్య శాఖ
దేశంలో ఇంకా సెకండ్‌ ‌వేవ్‌ ‌సమసిపోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరించింది. దేశంలో ఇప్పటికీ ప్రతిరోజు 30 వేల పైచిలుకు కొరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ ఆర్‌-‌ఫ్యాక్టర్‌ ‌సంఖ్య 1.2గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ ‌వాల్యూ పెరుగుతుంది’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ ‌సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ ‌నాడు పేర్కొన్నారు. దేశంలో మొత్తం 44 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కేరళలోని పది జిల్లాలు, మహారాష్ట్రలో మూడు, మణిపూర్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మేఘాలయా, మిజోరాం రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం రోజువారీ కేసుల్లో 47 శాతం ఈ జిల్లాల్లోనే వెలుగు చూశాయని ఆయన పేర్కొన్నారు. అయితే..కేసుల పెరుగుదల దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన విషయాన్ని కూడా లవ్‌ అగర్వాల్‌ ఈ ‌సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Reply