Take a fresh look at your lifestyle.

వైరా గ్రామదీపికల అధ్యక్షురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే

ఖమ్మం సిటి, మే 18 (ప్రజాతంత్ర విలేకరి) : వైరా మండల గ్రామదీపికల మండల అధ్యక్షురాలు ఆది రజనిని స్తానిక ఎంఎల్‌ఏ ‌లావుడ్యా రాములు నాయక్‌ ‌సోమవారం పరామర్శించారు. ఆమె గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌ ‌వెళ్లి మెరుగైన చికిత్స తీసుకుని ఇంటికి రాగా విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఏ ‌రాములునాయక్‌ ఆమెను ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్యపరిస్తితిని కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా దేనికీ అధైర్యపడవద్దు అంటూ మనోధైర్యం చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌బొర్రా రా•శేఖర్‌, ‌వైరా మండల అధ్యక్షులు •పసుపులేటి మోహనరావు, వైరా మండల ఎంపిపి పావని, వైరా మండల జడ్పీటిసి కనకదుర్గ, చైర్మన్‌ ‌సూతగాని జైపాల్‌, ‌వైస్‌చైర్మన్‌ ‌ముళ్లపాటి సీతారాములు, టిఆర్‌ఎస్‌నాయకులు మిట్టపల్లి నాగి, శేఖర్‌, ‌వైరా నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ ‌నాయకులు ఓంకార్‌, ‌కార్తీక్‌, ‌దేవిశెట్టి మణిదీప్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply