Take a fresh look at your lifestyle.

బెంగాల్‌ ‌నాలుగో విడత పోలింగ్‌లో హింసాత్మక ఘటనలు

  • సిఆర్పిఎఫ్‌ ‌కాల్పుల్లో నలుగురు మృతి
  • కూచ్‌బెహర్‌లోని పోలింగ్‌ ‌బూత్‌లో ఎన్నిక వాయిదా
  • వెంటనే నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
  • ఘటనపై తీవ్రంగా మండిపడ్డ టిఎంసి

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌ ‌సందర్భంగా హింస చెలరేగింది. శనివారం జరిగిన నాలుగో విడతలో జరిపిన పోలీస్‌ ‌కాల్పుల్లో నలుగురు పౌరుల మరణించారు. సీఆర్పీఎఫ్‌ ‌బలగాల కాల్పుల్లో వీరు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియరాలేదు. వి•డియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన సితాకుల్చీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జోర్‌ ‌పట్టీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటనపై రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. బిజెపి కనుసన్నల్లోనే ఇది జరిగిందని టిఎంసి ఆరోపించింది. ఇదిలావుంటే పశ్చిమబెంగాల్‌లో మరో 44 స్థానాలకు శనివారం పోలింగ్‌ ‌జరిగింది. ఉత్తర బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌, అలీపర్దౌర్‌ ‌జిల్లాల్లోనూ దక్షిణ 24 పరగణాలు, హవ్‌డా, హుగ్లీ జిల్లాల్లోనూ ఈ సీట్లున్నాయి. కేంద్ర మంత్రులు బాబుల్‌ ‌సుప్రియో, ఇద్దరు బీజేపీ ఎంపీలు, ఇద్దరు బెంగాల్‌ ‌మంత్రులు పార్థ చటర్జీ, అరూప్‌ ‌బిస్వాస్‌ ‌మొదలైన హేమాహేవి•ల భవిత ఈ నాలుగో దశలో తేలనుంది. 373 మంది అభ్యర్థుల జాతకాలను కోటీ 16 లక్షల మంది వోటర్లు తేల్చనున్నారు. 15,940 పోలింగ్‌ ‌కేంద్రాల పహారాకు ఏకంగా 789 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఇప్పటివరకూ జరిగిన 91 సీట్ల పోలింగ్‌లో కనీసం 63-68 స్థానాలను బీజేపీ గెలుచుకోబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా అన్నారు. కాగా, కాల్పుల ఘటన నేపథ్యంలో సీతల్‌కుర్చి (కూచ్‌బెహర్‌)‌లోని 126వ నెంబర్‌ ‌పోలింగ్‌ ‌బూత్‌లో ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్ర ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించింది. మరోవైపు, కాల్పుల ఘటనకు నిరసనగా కూచ్‌బెహర్‌లో ఆదివారం నిరసన ర్యాలీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టనున్నారు. కాల్పుల్లో మృతి చెందిన వోటర్లు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. మమత బెనర్జీ స్పందిస్తూ, తన భయాందోళన నిజమైందన్నారు. కేంద్ర బలగాల పట్ల తాను వ్యక్తం చేసిన ఆందోళనలో వాస్తవం ఉందని ఈ సంఘటన రుజువు చేసిందన్నారు.

Leave a Reply