Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా ఆగని కొరోనా విలయం

24గంటల్లో 22,252 కేసులు నమోదు 467మంది మృతి

దేశంలో కొరోనా విలయతాండవం కొన సాగుతోంది. 24 గంటల్లో మొత్తం 22,252 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మంగ ళవారం నాటికి కేసుల సంఖ్య 7,19,665కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాక బులిటెన్‌ ‌విడుదల చేసింది. 467 మంది చనిపోయారు. నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య 6లక్షల నుంచి 7లక్షలకు చేరింది. ఈ నెల 3 నుంచి దాదాపు రోజు 20వేల కేసులు నమోదవుతున్నాయి. కొరోనా కేసుల్లో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరిన ఇండియాలో మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు.

ఇప్పటి వరకు 4,39,947 మంది రికవరీ అయ్యారని, గడచిన 24 గంటల్లో 15,515 మందికి వ్యాధి నయం అయిందని అన్నారు. ఇక దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నమోదవుతోంది. అక్కడ ఇప్పటి వరకు 2,1,987 కేసులు ఉండగా.. 9,026 మంది చనిపోయారు. తమిళనాడులో 11498 కేసులు ఉండగా.. 1517 మంది చనిపోయారు. ఢిల్లీలో 100823 కేసులు ఉండగా 3115 మంది చనిపోయారు. గతవారం రోజులుగా నిత్యం 20వేలకు పైగా పాజిటివ్‌ ‌కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో జులై మాసం ప్రారంభం నుంచి కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. జులై 1 నాటికి దేశంలో 5,85,493 కొరోనా కేసులు నమోదుకాగా ఈ ఆరు రోజుల్లోనే లక్షా 34వేల కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ ఆరురోజుల్లోనే దేశంలో 2760 మంది వైరస్‌ ‌బాధితులు మృత్యువాతపడ్డారు.

Leave a Reply

error: Content is protected !!