Take a fresh look at your lifestyle.

ఫారెస్టు అధికారుల దాష్టీకం

  • ఆదివాసీ రైతును చితకబాది …
  • మూత్రం తాగించేందుకు ప్రయత్నం ..
  • కొత్తగూడ ఏజెన్సీలో ఆదివాసీలను బతకనివ్వరా .. ప్రజాసంఘాల ఆగ్రహం

కొత్తగూడ, ప్రజాతంత్ర, మార్చ్ 12,: ఒక పక్క ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యను పరిష్కరించి అందరికి పట్టాలు ఇస్తమని చెబుతుంటే అసెంబ్లీ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే సీతక్క పోడు సమస్యలను ప్రభుత్వానికి విన్నవిస్తున్నా… ఫారెస్టు అధికారులు ఆదివాసీలపై జరుపుతున్న దాడులు ఆగడం లేదు . మహబూబాబాద్‌ ‌జిల్లా గంగారం మండలం పుట్టల భూపతి గ్రామంలోని పోడు సాగు రైతు సోలం బాబు అనే వ్యక్తిని చితకబాదిన ఫారెస్ట్ అధికారులు.. దారుణంగా హింసించి దాహంగా ఉందంటే అధికారుల మూత్రం తెచ్చి తాగించడానికి ప్రయత్నించారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పుట్టల భూపతి గ్రామ సమీపంలోని వేంపల్లి పోడు ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ట్రెంచ్‌ ‌కొడుతుండగా అక్కడికి వెళ్లిన సోలం బాబు.. మీకు గతంలో అధికారులు, గ్రామపెద్దలు చూపెట్టిన హద్దు నుండి ట్రెంచ్‌ ‌కొట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులను వేడుకున్నారు. అయినప్పటికీ కనికరించకుండా అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి ఆతరువాత గంగారాంను ఫారెస్టు కార్యాలయానికి తీసుకువెళ్లి కర్రలతో చితకబాది, చిత్రహింసలు పెట్టారని తెలిపారు.

భూపతి సొమ్మసిల్లి కింద పడిపోవడంతో కొన్ని నీళ్లు ఇప్పించాలని డిఆర్వోను కోరగా, ఒక బాటిల్‌ ‌లో మూత్రం పోసి తాగమని ఇచ్చాడు అని బాధితుడు తెలిపాడు.. అర్ధరాత్రి 12:30 సమయలో గుట్టు చప్పుడు కాకుండా ఊరిలో వదిలి పెట్టిన అటవి శాఖ అధికారుల వైనంతో కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు ..స్థానిక పోలీసులను ఆశ్రయించగా మెరుగైన చికిత్స కోసం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఫారెస్ట్ అధికారుల పై స్థానిక పోలీస్‌ ‌స్టేషన్లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు.. చేశారు. ఇప్పటికైనా కొత్తగూడ ఆదివాసీలపై దాష్ట్టీకం మానుకోవాలని వారిని ప్రశాంతంగా ఉండేలా చూడాలి ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధితునికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

Leave a Reply