Take a fresh look at your lifestyle.

విలేకరులపై దౌర్జన్యం అమానుషం

విలేకర్ల బృందంపై ఎం.తుర్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ ‌నాయకుడు, గ్రామ సర్పంచ్‌ ‌కుమారుడు తుమ్మల యుగంధర్‌ ‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డ సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం ఇటీవల తుర్కపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గ్రామంలో గతంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం జరిగిన అభివృద్ధి పనులపై, సిసి రోడ్డు రద్దు చేసిన దాని పై ఎమ్మెల్యే నిధులు  ఇస్తే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎనిమిది సిసి రోడ్డు పనులను ఇచ్చిందని ఆరోపిస్తూ స్థానిక ఎంపిటిసి పై ఆరోపించడంతో పనులపై ప్రజల్లో ముఖాముఖీ చర్చకు సిద్దమని సవాల్‌ ‌విసిరారు.

తుర్కపల్లి నుండి పల్లెర్ల గ్రామానికి వెళ్లడానికి 33 ఫీట్ల రోడ్డును రాజకీయ దురుద్దేశంతో 21 ఫీట్‌లు చేసినరాని, వాట్సాప్‌లో ఆరోపణలు చేసి వీటిపై చర్చలు సిద్ధమా అని ఎంపీటీసీని ప్రశ్నిస్తూ విలేకరుల సమక్షంలో కూర్చుందాం అని తెలిపారు. ఎంపిటిసి తుమ్మల వెంకటరెడ్డి తనపై చేసిన కబ్జా ఆరోపణపై నిజాన్ని తెలపడానికి విలేఖర్ల బృందాన్ని గ్రామానికి పిలిచారు. ఈ విషయంలో యుగేందర్‌ ‌రెడ్డి జోక్యం చేసుకుని మీరు గ్రామానికి ఎందుకు వచ్చారని ఎవరు పిలిచారని మీ సంగతి చూస్తాను అని సంబంధిత పేపర్ల ఎడిటర్లకు లెటర్‌ ‌రాస్తానని తన ఇష్టం వచ్చినట్లు ఆగ్రహంగా, ఆవేశంగా విలేకర్ల బృందంపై విరుచుకుపడ్డారు. విలేకరుల బృందం ఎంత నచ్చజెప్పినా ఊరుకో కుండా ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేశారు.  ఆయన దౌర్జన్యాన్ని విలేకర్ల సంఘాలు ఖండించాయి.

Leave a Reply