జిహెచ్ఎంసీ ఎన్నికల లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో కోవిద్ నిబంధనలు పాటించడంలేదు అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసింది .రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కి ఇదే అంశం పై వినతి పత్రం సమర్పించింది. గ్రేటర్ హైదరాబాద్ కు జరగబోయే , మున్సిపల్ ఎన్నికల్ల సందర్భం లో,ప్రచార ప్రక్రియలో పోటీ చేసే అభ్యర్థులు,రాజకీయ పార్టీల నాయకులు,అభ్యర్థుల మద్దత్తు దారులు ఎటువంటి కోవిడ్ నివారణ జాగ్రత్తలు పాటించడం లేదన్న విషయం తమ సంస్థ దృష్టికి వచ్చిందని .ఈ విషయంలో కలుగ చేసుకొని నిర్దిష్టమైన సూచనలు జారీ చేయమని,మానవ హక్కుల వేదిక బాద్ధ్యులు ఎన్నికల కమిషనర్ ని బుధవారం 11.గంటలకు కలిసి ,ఒక వినతి పత్రం సమర్పించారు.ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించి ,ఈ విషయాలు తన దృష్టికి తెచ్చినందుకు,కృతఙ్ఞతలు చెప్పి ,తగు సూచనలు జారీ చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు మాస్క్ ధరించకుండా ,భౌతిక దూరం పాటించకుండా గుంపులు గా ప్రచారంలో పాల్గొంటూ కోవిద్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. రాజకీయ పార్టీ ల స్టార్ క్యాంపెయినర్లు కూడా బహిరంగ సమావేశాలు నిర్వహిస్తూ కోవిద్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు మానవ హక్కుల వేదిక రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కర్త ఎస్.జీవన్ కుమార్ ,నగర శాఖ ఉపాధ్యక్షుడు సయ్యద్ బిలాల్ వినతి పత్రంలో పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మానవ హక్కుల వేదిక ఫిర్యాదు