Take a fresh look at your lifestyle.

హుస్సేన్‌ ‌సాగర్‌లోనే వినాయక నిమజ్జనాలు

  • ఈయేటికి సుప్రీమ్‌ ‌కోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌
  • ‌సాగర్‌ ‌కాలుష్యం కాకుండా కాపాడాలని ప్రభుత్వానికి హెచ్చరిక

హుస్సేన్‌ ‌సాగర్‌లో గణేష్‌ ‌నిమజ్జనాలకు లైన్‌ ‌క్లీయర్‌ అయ్యింది. నిమజ్జనాలు జరుపుకోవడానికి సుప్రీమ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీమ్‌ ‌కోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హుస్సేన్‌ ‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతించింది.  తెలంగాణ ప్రభుత్వం తరపున సోలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా వాదనలు వినిపించారు. వెంటనే చెత్తనంతా క్లియర్‌ ‌చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

హుస్సేన్‌ ‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వానికి చివరి సారి అవకాశం ఇస్తున్నామని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ‌ప్యారిస్‌ ‌విగ్రహాల నిమజ్జనానికి ఇదేచివరి అవకాశమన్నారు. నిమజ్జనానికి ఆధునిక క్రేన్లు వినియోగించాలన్నారు. హుస్సేన్‌ ‌సాగర్‌ను ఒకప్పుడు మంచినీటి కోసం వాడే వారన్నారు. సాగర్‌ ఆధునీకరణకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతి ఏడాది నిమజ్జనం పేరిట దాన్ని కాలుష్యం చేస్తే ప్రజాధనం వృథా అయినట్టు కాదా అని సీజేఐ ప్రశ్నించారు.

Leave a Reply