ఊరు వాడ అంతా ఏకమై
వీధి వీధిన అందరు ఒకటై
భక్తి శ్రద్దలతో తలాఒకపనితో
నీ ఉత్సవాలు చేస్తామయ్య
ఓ మహా గణపయ్య
ఆనందం వెల్లి విరియంగా.
మహా మంటపం కట్టించి
మట్టి విగ్రహం నీది పెట్టించి
పలు పువ్వుల అలంకరణతో
ఉండ్రాళ్ళుపాయసంప్రసాదం
అభిషేకం అర్చన పూజలతో
నవ రాత్రులు ఘనంగా
పూజలు చేసుకుంటాం.
డప్పుచప్పుల్లఆహ్లాదంతో
భక్తిప్రపత్తులతోఆనందంగా
లడ్డుదద్దోజనంనివేదనతో
నిన్నుగంగమ్మఒడినిచేర్పించి
నీదీవెనలుమాపైఉండాలని
కోరుకుంటాంనీఅనుగ్రహం
కోసంఎదురుచూస్తుంటాం.
ఏపనియందైనా ఎలాంటి
ఆటంకంలు కలుగకుండా
విగ్నములుతొలగించే
ఓ విగ్నేశ్వరా జయహో..!
పార్వతిఈశ్వర ప్రాణ పుత్ర
ఓ వినాయక నీకు జయహో!
– ఎన్.రాజేష్ -ఎమ్మెస్సి
(కవి, జర్నలిస్ట్)
సరూర్ నగర్-హైదరాబాద్.