Take a fresh look at your lifestyle.

అభివృద్ధిబాటలో పల్లెలు: మంత్రి సత్యవతి

Road Developments in Villages Minister Satyavati

రాష్ట్ర ప్రభుత్వం ప్రతాష్టాత్మకంగా చేపట్టిన పల్లే ప్రగతి కార్యక్రమంలో పల్లేలు పల్లే ప్రగతి పట్టి సమగ్రాభివృద్ది చెందాయని రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్‌ అన్నారు.పల్లే ప్రగతి సమగ్ర నిర్వహణ కోసం పంచాయితీ రాజ్‌ ‌చట్టం పై అవగాహన కల్పిం చేందుకు ములుగు సమీపంలోని లీలా గార్డెన్‌లో గురువారం ఏర్పాటు చేసిన పంచాయితీ రాజ్‌ ‌సమ్మేళనం కు ముఖ్య అతిధిగా మంత్రి హజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతర విజయవంతంగా ముగిసినందుకు స్థానిక నాయకుల కు,అధికారులకు తన దన్యవాదాలు తెలిపారు. ఇప్పటి సర్పంచ్‌లు అదృష్టవంతులని,అప్పటి కాలంలో సర్పంచ్‌ల కు నిధులు అందక నానా తంటాలు పదేవారని అన్నారు. విద్యుత్‌ ‌ట్రాన్స్‌ఫారాలు కాలిపోతే దర్నాలు ఉండేవని, పంట పోలాలకు నీరు ఉండేది కాదని అన్నారు.

ఇప్పుడు మిషన్‌ ‌భగీరధ ద్వారా తాగునీరు,24 గంటల పాటు విద్యుత్‌,‌సిఎం కెసిఅర్‌ ‌చేపట్టిన ప్రాజెక్టులతో పంట పోలాలు నీటితో నిండి ఉన్నాయన్నారు.ఊరి పారిశుద్దత కోసం ట్రాక్టర్‌ల పంపిణి చేపట్టామని,పల్లేలు ఇప్పు డు మంచి ప్రగతితో కనిపిస్తున్నాయన్నారు.పల్లేల ప్రగతికి సిఎం కెసిఅర్‌ అత్యంత ప్రాదాన్యతను ఇస్తు అర్దిక మాద్యం ఉన్నప్పటికి నెలకు 338 కోట్ల రూపాయలు క్రమం తప్పకుండా ఇస్తున్నారన్నారు. సర్పంచ్‌లు పోటీ పడి పనిచేసి పల్లేల ప్రగతిని చాటి చెప్పాలని,సర్పంచ్‌లు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాల న్నారు. హరిత హరం ద్వారా మొక్కలను నాటి తరిగిపోతున్న అటవి ప్రాంతాన్ని కాపాడుకోవాని,వాటి సంక్షే మానికి ప్రభుత్వం ఏటా 40వేల కోట్లు ఇస్తుందన్నారు.అన్ని రంగాలలో అభివృద్ది పరిచి ములుగు జిల్లాను అదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లా చైర్మెన్‌ ‌కుసుమ జగదీష్‌ ‌మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో గ్రామాల స్వరూపం మార్చడానికే పల్లే ప్రగతి కార్యక్రమం అన్నారు.గ్రామ ప్రధమ పౌరులుగా సర్పంచ్‌లు బాద్యతతో పనిచేయ్యా లన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply