Take a fresh look at your lifestyle.

‌గ్రామాలలో..69.4శాతం కొరోనా వైరస్‌

  • 8-45 ‌సంవత్సరాల వయస్సు వారిలో అధికం
  • పట్టణ మురికివాడల్లో 15.9 శాతం
  • సీరం సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి

ఐసీఎంఆర్‌ ‌నిర్వహించిన మొట్టమొదటి జాతీయ సెరో సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిని ఇండియన్‌ ‌జర్నల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌లో ప్రచురించారు. భారతదేశంలోని గ్రామాలలో మొత్తం 69.4 శాతం మందికి కొరోనా వైరస్‌ ‌సంక్రమించినట్లు ఆ సర్వేలో తెలిసినట్లు పేర్కొంది. ఈ సర్వేలో గ్రాణ ప్రాంతాల్లో 69.4 శాతం మందికి, పట్టణ మురికివాడలలో 15.9 శాతం మందికి, మిగిలిన ప్రాంతాలలో 14.6 శాతం మందికి కొరోనా పాజిటివ్‌ ‌వచ్చినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 18-45 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో పాజిటివిటీ అత్యధికంగా 43.3 శాతం ఉంది. ఆ తరువాత 46-60 సంవత్సరాల వారిలో 39.5 శాతం ఉండగా 60 ఏళ్లు పైబడిన వారిలో అత్యల్పంగా కొరోనా పాజిటివిటి ఉన్నట్లు తేలింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో 70 జిల్లాల్లో 700 గ్రామాలు, వార్డుల్లో మే 11 నుంచి జూన్‌ 4 ‌వరకు ఈ సర్వే జరిగింది. కోవిడ్‌ ‌కవచ్‌ ఎలీసా కిట్‌ ఉపయోగించి 28,000 మంది రక్తనమునాలు సేకరించి ఐజీజీ యాంటీబాడీస్‌ ‌కోసం పరీక్షించింది. దేశంలో ప్రస్తుతం 45 లక్షల కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కానీ మే నెల వరకే దేశంలో 64 లక్షల మందికి కొరోనా సోకి ఉంటుందని ఐసీఎంఆర్‌ అం‌చనా వేసింది. దేవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్‌ ‌రిలీజ్‌ ‌చేసింది. ఇండియన్‌ ‌జర్నల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసర్చ్‌లో వీటిని ప్రచురించారు.

దేశంలోని 0.73 శాతం మంది వ్యక్తులు కోవిడ్‌19 ‌ప్రభావానికి లోనై ఉంటారని ఐసీఎంఆర్‌ అభిప్రాయ పడింది. ఈ సీరో సర్వేను మే 11 నుంచి జూన్‌ 4‌వ తేదీ వరకు నిర్వహించారు. దీని కోసం 21 రాష్ట్రాల్లోని సుమారు 28వేల మంది రక్త నమోనాలను పరీక్షించారు. 18 నుంచి 45 ఏళ్ల(43.3) మధ్య వయసు ఉన్నవారిలో సీరో పాజిటివిటీ ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. ఆ తర్వాత 46 నుంచి 60 ఏళ్ల మధ్యవారిలో 39.5 శాతం, 60 ఏళ్లు దాటిన వారిలో 17.2 శాతం సీరో పాజిటివిటీ ఉన్నట్లు గుర్తించారు. మే నెల ఆరంభంలో దేశవ్యాప్తంగా సుమారు 64,68,388 మంది పెద్దలకు వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ‌సోకి ఉంటుందని సీరో సర్వే నివేదిక వెల్లడించింది. మే నెలలో సగటును 82 నుంచి 130 మందికి సోకిన ఇన్‌ఫెక్షన్లను గుర్తించలేకపోయినట్లు ఐసీఎంఆర్‌ ‌చెప్పింది. మే నెల వరకు జనాభాలో కేవలం ఒక శాతం మంది మధ్యవయస్కులకు మాత్రమే సార్స్ ‌సీఓవీ2 వైరస్‌ ‌సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. సీరో సర్వే ప్రకారం.. మే, జూన్‌ ‌నెలల్లో గ్రాణ ప్రాంతాలకు వైరస్‌ ‌ప్రబలినట్లు గుర్తించారు. తొలుత పెద్ద నగరాల్లో కేసులు నమోదు అయినా..ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు కోరోనా వెళ్లడంతో కొంత ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. యూపీ, బీహార్‌ ‌లాంటి రాష్టాల్లో్ర కేసులు ఇంకా బయటపడే ఛాన్సు ఉంది. గ్రాణ ప్రాంతాల్లో సీరో పాజిటివిటీ 69.4 శాతంగా, పట్టణ మురికివాడల్లో 15.9 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 14.6 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. సీరో పాజిటివిటీ పరీక్ష ద్వారా రక్తంలో యాంటీబాడీలు ఉన్నాయో లేదో తెలుస్తుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!