Take a fresh look at your lifestyle.

విజయీభవ

కారుణ్య సముద్రుని

మృదు సమీర స్పర్శాలింగనా ఒడిలో

ఉత్తుంగతరంగ పుష్పమాలికార్చన సౌగంధ కార్యంలో

నిత్యాభిషేక అభిషిక్త నా పృథ్వీతలం!

పాత్రోచిత భావ పరపుష్ట పౌరాణిక

పద్యరాగానంద సుధా జలధిలో జలకాలాడి

ఆధునిక సాహితీ పదవల్లరుల కవితా ఘట్టంలో

జీవ చిత్ర వర్ణ అక్షరామృతంతో జాలువారి

ముగ్ధ మనోహర స్నిగ్థ సుందర భంగిమాకృతుల

రూప లావణ్య రసచేతనత్వంతో నర్తించి

శ్రీ శారదా మాత కటాక్ష శాస్త్రీయ సంగీత కుటీరాన

మాధుర్య గమకాల రాగరంజిత పల్లకీపై ఊరేగిన

నా పుడమితల్లి ప్రతిభాపాటవాలు చర్విత చరణాలు

రేపటి వసంతోదయాన

నేల నాలుగు చెరగులా

ఖండాంతర ఖ్యాతీ కరవాలాన్ని చేబూని

నవీన సమాజ నిర్మాణ కదన రంగంలో

సింహంలా జాలు విదిలించి ముందుకురికే

భావి భారత భాగ్య బీజామృత సుదీప్తీ విజయగాథల

సువర్ణాక్షరాల అధ్యాయ అంకురార్పణలెన్నో!

-వంగర. పరమేశ్వరరావు

9491400534

Leave a Reply