Take a fresh look at your lifestyle.

‌డ్రగ్స్‌కు విజయవాడకు సంబంధం లేదు

  • దీనిపై డిఆర్‌ఐ ‌విచారణ చేస్తోంది
  • వివరణ ఇచ్చిన విజయవాడ నగర పోలీస్‌ ‌కమిషనర్‌

విజయవాడ,సెప్టెంబర్‌ 20 : ‌గుజరాత్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌కు విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన డియా సమావేశంలో మాట్లాడుతూ, విజయవాడకు డగ్్ర‌‌తరలిస్తుండగా పట్టుకున్నారన్నది వాస్తవం కాదని సీపీ స్పష్టం చేశారు. గుజరాత్‌ ‌ముంద్ర పోర్టులో హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. చెన్నై నివాసముంటున్న దుర్గాపూర్ణ వైశాలి పేరుతో విజయవాడ అడ్రస్‌ ‌పేరుతో జీఎస్టీ రిజిస్టేష్రన్‌ ‌తీసుకున్నారన్నారు. కొన్నేళ్లుగా వైశాలి, ఆమె భర్త, సుధాకర్‌ ‌చెన్నైలో ఉంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డీఆర్‌ఐ ‌విచారణ జరుపుతోందని సీపీ వివరించారు. ఈ కేసుపై అహ్మదాబాద్‌, ‌ఢిల్లీ, చెన్నైలలో కూడా సోదాలు నిర్వహించాయన్నారు.  విజయవాడలో ఇంటి అడ్రస్‌తో లైసెన్స్ ‌తీసుకోవడం తప్పితే డ్రగ్స్ ఆనవాళ్లు లేవని  సీపీ తెలిపారు.

అయితే గుజరాత్‌ ‌నుంచి విజయవాడకు హెరాయిన్‌ ‌సరఫరా చేస్తున్నారనే వార్తలు అవాస్తవమని  పోలీస్‌ ‌కమిషనర్‌ ‌బత్తిని శ్రీనివాసులు తెలిపారు. గుజరాత్‌ ‌ముంద్రా పోర్టు నుంచి దిల్లీకి హెరాయిన్‌ ‌తరలిస్తున్నారని స్పష్టం చేశారు.  ఆషీ కంపెనీ లైసెన్స్‌లో విజయవాడ చిరునామా ఉందన్న మాట వాస్తవమే అయినా విజయవాడ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు జరగట్లేదన్నారు. చెన్నై, అహ్మదాబాద్‌, ‌దిల్లీలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయని చెప్పారు. విజయవాడ చిరునామాతో ఉన్న కంపెనీ యజమాని చెన్నైలో ఉంటారని.. చాలా ఏళ్ల క్రితమే చెన్నైలో స్థిరపడ్డారని సీపీ ప్రకటనలో వెల్లడించారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ‌రెవెన్యూ ఇంటెలిజెన్స్(‌డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లో రూ. 9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్న విషయం తెలిసిందే.

ఈ డ్రగ్స్ ‌ముఠాకు విజయవాడతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాల సమాచారంతో.. డీఆర్‌ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో తనిఖీలు చేయగా భారీగా హెరాయిన్‌ ‌బయటపడింది. వాటి విలువ దాదాపు రూ. 9వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కంటైనర్లు అప్గానిస్థాన్‌ ‌నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్‌ ‌సంస్థకు చెందినవిగా గుర్తించారు. టాల్కమ్‌ ‌పౌడర్‌ ‌ముసుగులో డ్రగ్స్ ‌దందా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply