Take a fresh look at your lifestyle.

అక్బరుద్దీన్ వ్యాఖ్యల పై కేసీఆర్ స్పందించాలి..

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి 
కరోనా పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న తీరుపై ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు.శనివారం దీని పై విజయశాంతి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో.. కొన్ని లోపాలున్నా… వాటిని పట్టించుకోకుండా అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్  ఈ మధ్య ప్రెస్ మీట్ లో స్పష్టం  చేస్తూ అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన కారణంగా ఒక పత్రిక ను ఉద్దేశిస్తూ వారికి కొరోన రావాలని  కెసిఆర్  శాపం పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే   కొరోనా   రావాలన్న కేసీఆర్ … మరి గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా  ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ పై ఎలాంటి శాపనార్థాలు పెడతారోననీ తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని అన్నారు.గాంధీ ఆసుపత్రి జైలు లాగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ కి బహుశా కెసిఆర్  పెట్టిన శాపం గురించి తెలిసి ఉండకపోవచ్చు. లేదా కెసిఆర్ … తాను ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్  ధీమా ఉండి ఉండొచని  లేదా మాకు ఈ శాపాలు తగలవని… తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్  భావించి ఉండొచ్చుని విమర్శించారు.మరి  రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్ కామెంట్స్ పై కెసిఆర్  శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా అనే విషయాన్ని వేచి చూడాలన్నారు..

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!