Take a fresh look at your lifestyle.

తండ్రిబాటలో వడివడిగా అడుగులు సిఎం జగన్‌పై విజయసాయి ప్రశంసలు

అమరావతి,జులై 2 : ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రామలతో దూసుకు పోతున్నారని  వైసీపీ ఎంపీ   విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. ట్విటర్‌ ‌వేదికగా పలు అంశాలపై ఆయన స్పందించారు.  నాన్న ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు కోసం వేస్తా అని చెప్పటమే కాదు, ఆ మహానేత తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని ఇంకొక అడుగు ముందుకి తీసుకుని వెళుతూ అత్యాధునిక సదుపాయాలతో 108,  104 వాహనాలను యువ ముఖ్యమంత్రి జగన్‌ ‌ప్రారంభించారని విజయ సాయిరెడ్డి ట్వీట్‌ ‌చేశారు.

253 ఎకరాలు భూమి గల్లా వారికి ఇచ్చి పదేళ్లయినా అమరరాజా  ఇన్‌‌ఫ్రా  దాన్ని నిబంధన ప్రకారం రెండేళ్లలోగా ఫ్యాక్టరీ  పెట్టి 20వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి. అవే జరగక పోవడంతో ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకుంది. పెద్ద, చిట్టీ నాయుళ్లు గుండెలు బాదుకుంటున్నారు. నిబంధనలు అమలుచేస్తే కక్ష సాధింపట. అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. ఒప్పందం మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమైన అమరరాజా ఇన్‌‌ఫ్రా టెక్‌ ఉపయోగించుకోని రూ.60 కోట్లకుపైగా విలువైన 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఎంపి అభినందించారు.

Leave a Reply