Take a fresh look at your lifestyle.

విహాన్‌ ‌శర్మ సాహసయాత్ర ఢిల్లీ నుంచి బెంగులూరు చేరుకున్న ఐదేళ్ల బుడతడు

లాక్‌డౌన్‌ ‌కారణంగా గత రెండు నెలల నుంచి నిలిచిపోయినా దేశీయ విమానాల రాకపోకలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో దేశంలోని వేర్వేరు నగరాల్లో ఉండిపోయిన చాలా మంది ఇప్పుడు అయినవాళ్ల దగ్గరికి వెళ్లేందుకు అవకాశం లభించింది. అలా ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబసభ్యులను కలుసుకునేందుకు విమాన ప్రయాణం చేసిన వారిలో విహాన్‌ ‌శర్మ అనే ఐదేండ్ల బాలుడు కూడా ఉన్నాడు. విహాన్‌ ‌శర్మ లాక్‌డౌన్‌కు నెల రోజుల మందే ఢిల్లీలో ఉన్న తన అమ్మమ్మ, తాతయ్యల దగ్గరికి వెళ్లాడు. అయితే, ఆ తర్వాత కరోనా మహమ్మారి విస్తరించడంతో లాక్‌డౌన్‌ ‌మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దీంతో విహాన్‌ ‌మూడు నెలలుగా అక్కడే చిక్కుకుపోయాడు.

తన తల్లితండ్రి మాత్రం కర్ణాటకలో ఉండిపోయారు. అయితే సోమవారం డొమెస్టిక్‌ ‌సర్వీసులు ప్రారంభం కావడంతో ఆ బాలుడిని ఒంటరిగా తల్లిదండ్రుల చెంతకు పంపించారు. స్పెషల్‌ ‌క్యాటగిరీ ప్రయాణికుడిగా ఢిల్లీ నుంచి వచ్చిన ఆ బాలుడిని అతని తల్లి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రిసీవ్‌ ‌చేసుకున్నది. బాలుడు ఢిల్లీలో విమనం ఎక్కి బెంగుళూరులో దిగాడు. చేతిలో సెల్‌ఫోన్‌, ‌ప్రత్యేక క్యాటగిరీకి చెందిన బ్యాడ్‌ ‌పట్టుకుని అందరినీ మురిపించాడు.

 

Leave a Reply