Take a fresh look at your lifestyle.

సీజనల్‌ ‌వ్యాధుల పట్ల అప్రమత్త అవసరం

ఏలూరు, జూలై 16 : సీజనల్‌ ‌వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధాన్ని నివారించకపోతే ప్రజలు వ్యాధులబారిన పడాల్సి వస్తుందన్నారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశిం చారు. పంచాయతీ కార్యదర్శులు, ఈవో ఆర్‌డీలు గ్రామాల్లో నివాసం ఉండక పోవడంవల్లే పారిశుద్ధ్యంపై తగిన దృష్టి సారించలేకపోతున్నారన్నారు. అలాగే పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. డ్రైన్ల నిర్వహణపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడానికి పంచాయతీ అధికారులే కారణమన్నారు. ఆర్‌ అం‌డ్‌ ‌బీ, పంచా యతీరాజ్‌, ‌నీటిపారుదల శాఖాధికారులు గుత్తేదారులతో పనులను చేయించా లన్నారు. ముఖ్యమంత్రి హాలకు సంబంధించి ఏ పనులు పెండింగులో ఉన్నాయో తెలియజేస్తే పై అధికారులతో తాను మాట్లాడి అనుమతులు మంజూరు చేయిస్తానని చెప్పారు.

Leave a Reply