Take a fresh look at your lifestyle.

నిరభ్యంతరంగా కొరోనా మృతుల అంత్యక్రియలు

  • ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు
  • వైద్యం నిరాకరించే ప్రైవేట్‌ ఆస్తప్రులపై చర్యలు
  • కాకినాడలో కోవిడ్‌ ‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం డియాతో మంత్రి ఆళ్లనాని

రాజమండ్రి,జూలై 29 : కరోనాతో మృతి చెందితే నిర్భయంగా అంత్యక్రియలు చేసుకోచ్చని ఆంధ్రప్రదేశ్‌ ‌వైద్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. మృతదేహాలను ఖననం చేసుకోవాడనికి బంధువులు, మిత్రులు ఆపోహాలకు గురికావద్దని సూచించారు. జిల్లాలో కరోనాపై ఆయన సక్షించిన అనంతరం బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ కరోనా రోగులకు వైద్యం నిరాకరించే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడలో కోవిడ్‌ ‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఆళ్లనాని ప్రకటించారు. ప్రభుత్వం పారదర్శకంగా నివారణ చర్యలు తీసుకుంటుందన్నారు. రోగులకు సమయానికి ఆహారం, ఔషదాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.  కరోనా కోసం ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. దేశంలోనే కరోనా టెస్టుల నిర్వహణలో ఏపీ నెంబర్‌వన్‌లో ఉందని వెల్లడించారు. రాజమండ్రి కార్పొరేషన్‌ ‌కార్యాలయంలో కొవిడ్‌ ‌వైద్య సహాయక  చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, విశ్వరూప్‌, ఎం‌పీ మార్గాని భరత్‌, ‌కాపు కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. కరోనా వైద్య పరీక్షల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ప్రతి కోవిడ్‌ ‌హాస్పిటల్‌ ‌వద్ద బెడ్స్ ఆక్యుపెన్సీ, ఖాళీల వివరాలను ఆసుపత్రి వద్ద కచ్చితంగా డిస్‌ ‌ప్లే చేయిస్తామన్నారు. ఇప్పటికే వైద్యం నిరాకరిస్తున్న పలు ప్రైవేట్‌ అసుపత్రులను గుర్తించామన్నారు.

వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17వేల మంది వైద్య  సిబ్బందిని రిక్రూట్‌ ‌చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తేనే రాష్ట్రంలో కరోనా వైరస్‌ని సమర్ధవంతంగా నియత్రించగలమని ఆళ్ల నాని పేర్కొన్నారు.  ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయని, సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌కరోనా నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కోవిడ్‌పై చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తోందని ఆళ్ల నాని పేర్కొన్నారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా ఏపీ ఉంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కరోనా డెత్‌ ‌రేట్‌ ‌తక్కువగా ఉంది. ప్రైవేట్‌ ఆస్పత్రులు వైద్యానికి నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అత్యంత పారదర్శకంగా కరోనా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు సరికావని, ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కడా డాక్టర్ల కొరత లేదన్నారు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే 24 గంటల్లోనే పరిష్కరించాం. చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడాము. ప్రస్తుతం జిల్లాలో ఆరు కోవిడ్‌ ఆసుపత్రులు ఉన్నాయి. వాటి సంఖ్య మరో మూడు పెంచుతున్నాం. వైద్యులు, నర్సులు, ఇతర స్టాఫ్‌ ‌రిక్రూట్మెంట్‌ ‌కూడా చేపడుతున్నాం.

జిల్లాలో 2 కోవిడ్‌ ‌సెంటర్లకు అదనంగా మరో రెండు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. కోవిడ్‌ ‌మరణాలు కూడా దాచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు’ అని మంత్రి ఆళ్లనాని తెలిపారు.  బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత పదవిలో ఉండి చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. కరోనా మరణాలపై ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబద్దాలను ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మవద్దన్నారు. ఆయన హయాంలో ఒక్క వైద్య పోస్టునూ భర్తీ చేయలేదని విమర్శించారు. 108, 104లతోపాటు ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు.  ప్రజారోగ్యం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌కృషిని ఓర్వలేక, విజ్ఞత మరిచి బాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా నియంత్రణలో దేశంలోనే ఏపీ ప్రత్యేక గుర్తింపు పొందిందని, అత్యధిక టెస్టులు చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని అన్నారు.

Leave a Reply