Take a fresh look at your lifestyle.

వేప చెట్టు

శ్రేష్ఠమైన గాలినిచ్చే వేప
ఆకు పచ్చ అలంకారణతో
నిండు ముత్తైదలా
కల కలలాడుతూ
దర్శన మిచ్చేది
విభిన్నమైన పక్షులు
గూడు కట్టుకుని
కిల కిల రాగాల
సవ్వడితో ప్రకృతి
పరవశించి పోతుంది
ఇంటి ముందు వేప చెట్టు
స్వచ్ఛమైన గాలి
సూర్యతాపం నుండి
సేద తీర్చే సామాన్యుడి ఏసి
వసంతకాలంలో చిగురించే
వేప చిగురు
సర్వరోగ నివారిణిగా
భావిస్తూ ఉగాది పచ్చడిలో
ఉపయోగిస్తూ ఆస్వాదించే
దివ్య ఔషదం
వేప కల్లుతో కాళ్ళ నొప్పులు
మాయం అవుతాయని
పెద్దల నమ్మకం
వేసవిలో ఫలములను
ఇచ్చే వేప పండు
రుచి ఆమోగం
ఆ గింజల ద్వారా వచ్చే
పొడి పంట పొలాల్లో
ఎరువుగా వాడుతూ
అధిక దిగుబడిని
పొందుతూ అనేక రకాలుగా
మేలు చేస్తుంది
అటువంటి వేప చెట్టు
నేడు అంతు చిక్కని వింత
వ్యాధి తో బోసి పోయి
బోరున విలపిస్తుంది…..

   – మిద్దె సురేష్‌
           9701209355 

Leave a Reply