Take a fresh look at your lifestyle.

కొత్త 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు అమర్చుతున్నారు. మొత్తం 400 పైగా వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో 104 వాహనాలను ఏఎల్‌ఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ ‌లైప్‌ ‌సపోర్ట్) ‌వాహనాలుగా మార్చుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేస్తాయి. వీటి కోసం అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ‘రెస్‌మెడ్‌?’ ‌నుంచి కొనుగోలు చేసిన మొబైల్‌ ‌వెంటిలేటర్లను అమర్చుతున్నారు. 104 వాహనాల్లోనూ వెంటిలేటర్‌తో పాటు డిఫ్రిబ్యులేటర్‌(‌గుండె సంబంధిత ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడే యంత్రం), పల్సాక్సీ మీటర్‌(‌రక్తంలో ఆక్సిజన్‌ ‌శాతం నియంత్రణ) వంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. ఇవన్నీ అమర్చి ఈ నెలలో వీటిని వినియోగిం చేందుకు సమాయత్తం చేస్తున్నారు.

గ్రామీణ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు:
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కిట్లను అందజేయనుంది.ఇందుకుగాను రూ.3.84 కోట్లను జిల్లాలకు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామాల్లో పనిచేస్తున్న 19,584 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం,టోపి,రెండు జతల బ్లాక్‌ ‌గమ్‌ ‌షూ,యూనిఫాం మీద వేసుకోవడానికి కోట్‌ ‌పంపి ణీ చేయనుంది.ఒక్కొక్క రక్షణ కిట్‌ ‌కోసం గరిష్టంగా రూ.3 వేల చొప్పున ఖర్చు చేయనున్నట్టు పంచా యతీరాజ్‌ ‌శాఖ కమిషనర్‌ ‌గిరిజా శంకర్‌ ‌తెలిపారు.

Leave a Reply