Take a fresh look at your lifestyle.

వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ ‌తక్షణం తిరస్కరించాలి

  • నామినేషన్‌ ‌పత్రాల్లో కేసులపై ప్రస్తావన ఏదీ
  • అక్రమాలపై విచారణ చేయకుండా ఎలా అనుమతించారు
  • మాజీ కలెక్టర్‌ అ‌క్రమాలపై రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ ‌నేతలు

అ‌క్రమాలకు పాల్పడి అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటూ..హైకోర్టులో కేసులు నడుస్తున్న సిద్దిపేట మాజీ కలెక్టర్‌, ‌టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై శాసనమండలి రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఉపేందర్‌ ‌రెడ్డికి కాంగ్రెస్‌ ‌నేతలు ఫిర్యాదు చేశారు. అతడి నామినేషన్‌ ‌తిరస్కరించాలని, నామినేషన్‌ ‌పత్రాల్లో తనపై ఉన్నకేసులకు సంబంధించిన వివరాలను ఇవ్వలేదన్నారు. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి తదితరులు కలిసి వీరు ఆయనకు ఫిర్యాదు ఇచ్చారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను తిరస్కరించాలని ఫిర్యాదులో కోరారు. ఐఏఎస్‌గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని మండలి రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ‌దృష్టికి కాంగ్రెస్‌ ‌నేతలు తీసుకెళ్లారు. వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదు చేసిన అనంతరం పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి వి•డియాతో మాట్లాడారు. శాసనమండలి ఎన్నికల్లో కేసీఆర్‌ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం నామినేషన్‌ ‌పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ ‌చేయాలని, కానీ ఇప్పటి వరకూ పెట్టలేదని అన్నారు. అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, కేసీఆర్‌ ‌సర్కారు ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ ‌పత్రాలను తాము పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరితే రిటర్నింగ్‌ అధికారి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ అంతా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కనుసన్నల్లోనే నడుస్తుందని రేవంత్‌ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌ ‌గోయల్‌తోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఐఏఎస్‌ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వొస్తుందని, ఐఏఎస్‌ ‌రాజీనామాను డీవోపీటీ శాఖ ఆమోదించాలని, సీఎస్‌ ఆమోదిస్తే సరిపోదని రేవంత్‌ ‌చెప్పారు. కేంద్రం దీనిపై సర్టిఫికెట్‌ ఇస్తే దానిని నామినేషన్‌లో సబ్మిట్‌ ‌చేయాల్సి ఉంటుందని, దీనిని ఆయన ఫాలో అయ్యారో లేదో చూడాలని అన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంలో డీవోపీటీ మంత్రిత్వ శాఖకు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. అవినీతిలో కూరుకుని పోయిన ఇలాంటి వ్యక్తి వల్ల వ్యవస్థ నాశనమవుతుందన్నారు. మాజీ కలెక్టర్‌ ‌వెంకట్రామి రెడ్డి జుగుప్సాకరమైన వ్యక్తి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌హోదాలో ఉండి ఆయన ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడమేంటని, ప్రభుత్వ అధికారిగా ఉన్న ఆయన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కోసం తన సమయం అంతా పనిచేశారని ఆరోపించారు.

మన దేశ బ్యూరోక్రాట్‌ ‌వ్యవస్థకు వెంకట్రామిరెడ్డి మచ్చలాంటి వాడన్నారు. ఇలాంటి వ్యక్తి వల్ల వ్యవస్థ నాశనమయ్యే ప్రమాదం ఉందని భట్టి అన్నారు. ఈ వ్యక్తి రాజీనామా చేసిన వెంటనే నిమిషాల్లో ఎలా ఆమోదిస్తారని, చీఫ్‌ ‌సెక్రటరీ ఏం ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావడంలేదని అన్నారు. ఈ వ్యవహారంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్‌ ‌రాంరెడ్డి నామినేషన్‌పై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. నామినేషన్‌ ‌పత్రాలు దాఖలు చేసే సమయంలో ఫిర్యాదుదారులను లోపలికి అనుమతించాలన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వెంకట్రామిరెడ్డికి సహకారం అందిస్తుందని ఆరోపించారు. నిన్ననే ఎన్నికల ప్రధానాధికారికి దీనిపై పిర్యాదు చేశామని…తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. నామినేషన్‌ ‌పాత్రలు పరిశీలించే సమయంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే దాన్ని తిరస్కరించాలని తెలిపారు. తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి జాతీయ పార్టీగా లోపలికి అనుమతించమని అడిగితే రానివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply