Take a fresh look at your lifestyle.

వెంకట్రామిరెడ్డి అక్రమాలపై విచారణ చేయాలి

  • ఎమ్మెల్సీగా తక్షణం నామినేషన్‌ ‌తిరస్కరించాలి
  • ఆయన రాజీనామాను పెండింగ్‌లో పెట్టాలి
  • గతంలోనే ఆయన అక్రమాలపై కాంగ్రెస్‌ ‌ఫిర్యాదు చేసింది
  • వి•డియా సమావేశంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌

అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ సిద్ధిపేట మాజీ కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి వేసిన ఎమ్మెల్సీ నామినేషన్‌ ‌పత్రాన్ని తక్షణం తిరస్కరించాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. అలాగే ఆయన ఆస్తులపై విచారణ చేయించాలన్నారు. సిద్ధిపేటలో ఆయన కెసిఆర్‌ ‌చెప్పినట్లు చేసి కోట్లు సంపాదించాడని ఆరోపించారు. అలాంటి అవినీతి అధికారిని భుజానకెత్తుకోవడం వెనక మతలబు ఉందని అంటూ  సీఎం కేసీఆర్‌, ‌ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ‌పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికారిగా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు.

వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్‌కు వెంకట్రామిరెడ్డి బంట్రోతుగా పని చేశారని ఆరోపించారు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డును అష్టవంకరలు తిప్పడం వెనుక వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణ నుంచి అప్పట్లో వెంకట్రామిరెడ్డి తప్పించుకున్నారని తెలిపారు. వెంకట్రామిరెడ్డిని కేసీఆర్‌ ఆఘమేఘాల వి•ద ఎమ్మెల్సీని చేస్తున్నారని విమర్శించారు. అందరి ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలకు అత్యంత ప్రీతిపాత్రుడైన వెంకట్రామిరెడ్డిని ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా కలెక్టర్‌గా కేసీఆర్‌ ‌నియమించారని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యం వెంక్రటామిరెడ్డిలో ఉందన్నారు. వెంకట్రామిరెడ్డిని కేసీఆర్‌ ‌దక్కన్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ‌బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. దక్కన్‌ ఇన్‌ ‌ఫాస్ట్రక్చర్‌ ‌వివరాలు దొరకడంలేదని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వెంక్రటామిరెడ్డిపై జరిమానా విధించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్‌ ‌కాళ్లు మొక్కి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడన్నారు. గతంలోనూ కలెక్టర్‌ ‌గా రూల్స్ ‌బ్రేక్‌ ‌చేశాడన్నారు. ’అప్పట్లో చిత్తూరు జిల్లా తాగునీటి పథకంలో పెద్ద అవినీతి జరిగింది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్‌ ‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హయాంలలో వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారు.

ముఖ్యమంత్రులను మెప్పించి ప్రమోషన్స్ ‌పొందడం వెంకట్రామిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కేసీఆర్‌ ‌మెప్పుపొంది ఎమ్మెల్సీ పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో వెంకట్రామిరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హయాంలో చిత్తూరు జిల్లా తాగునీటి పథకంలో రూ.7వేల కోట్ల స్కామ్‌ ‌జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో వెంకట్రామిరెడ్డిపై హరీష్‌ ‌రావు అప్పట్లో ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడికి వెంకట్రామిరెడ్డి అత్యంత సన్నిహితుడు. కోర్టు ఉల్లంఘన కేసులున్న వెంకట్రామరెడ్డి రెడ్డి.. టీఆర్‌ఎస్‌కు బంట్రోతుగా మారి పనిచేసిండు. కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ రాష్ట్రపతికి కూడా వెంకట్రామిరెడ్డి పై పిర్యాదు చేసిండు. రాష్ట్రపతి నుండి సీఎస్‌కు చర్యలు తీసుకోమని లేఖ వచ్చినా పట్టించుకోలేదు.

వెంకట్రామిరెడ్డికి చెందిన  రాజ్‌ ‌పుష్పా సంస్థ కొకాపెట భూములను దక్కించుకుంది. దాంట్లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది. భూముల అమ్మకాల విషయంలో.. అక్రమాలు జరిగాయి.వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోవడం లేదు. సర్వీస్‌ ‌లో ఉన్న ఇలాంటి అవినీతి అధికారులపై   విచారణ చేయాలి. నిన్న వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయగానే.. ఇవ్వాళ ఎమ్మెల్సీని చేసిండు కేసీఆర్‌. ఇక రేపో మాపో్గ •నాన్స్ ‌మినిస్టర్‌ ‌గా నియమిస్తారని ప్రచారం అవుతుంది. ఇలాంటి వాళ్ల కోసమేనా తెలంగాణ వచ్చింది. తెలంగాణ ద్రోహులను పాలకులుగా నియమించడం ఏంటని’ సీఎం కేసీఆర్‌ను రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు.

Leave a Reply