Take a fresh look at your lifestyle.

నువ్వు దేవుడు సామీ….

  • అనాధ పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్న కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి
  • బర్త్‌డే సందర్భంగా కేక్‌ ‌కట్‌ ‌చేసి…వాచ్‌లు బహుకరణ
  • దేవుడులాంటి నాన్నకు మంచి పేరు తీసుకొస్తాం: కవల దత్తత పుత్రికలు రాధ, రాధిక

సిద్ధిపేట, మే 31 (ప్రజాతంత్ర బ్యూరో): అధికారం, డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి. కానీ, సా(సహా)యం చేసే గుణం మాత్రం చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది. అలాంటి వాళ్లలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి కూడా ఉంటాడు. ప్రజలకే కాదూ, అనాధ పిల్లలకు సా(సహా)యం చేయడంలో కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి ఎప్పుడూ ముందే ఉంటాడు. చేసే సా(సహా)యం కూడా అందరికీ తెలియాలి, పబ్లిసిటీ కావాలని కూడా ఎన్నడూ అనుకోడు. తాను చేసే పని ఎవరికీ తెలియకుండా చూసుకుంటున్నాడు సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి. అలా నువ్వు దేవుడవు సామీ అనిపించుకుంటున్నాడు కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి. తాజాగా…ఇప్పుడు కూడా అదే చేసాడు ఈయన. కానీ, ఆయన దత్తత తీసుకున్న అనాధ కవల పిల్లల బర్త్‌డే…కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి చేసిన సాయం కొంత బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. అనాధలైన ఇద్దరు కవల పిల్లను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఆ ఇద్దరు కవలలు ఏదీ కావాలన్నా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డే సమకూరుస్తాడు. అనాధ పిల్లలను ఉన్నతమైన స్థానాలలో చూడాలని కలెక్టర్‌ అనుకుంటున్నట్లుగానే…ఆ దత్తత బిడ్డలు కూడా దేవుడు లాంటి నాన్న(కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి)కు మంచి పేరు తీసుకొస్తామంటున్నారు.

వివరాల్లోకి వెళ్లితే…సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఆకారంలో బంగారం పనిచేసుకుంటూ జీవించే వెంకటేశం-పార్వతిలకు రాధా, రాధికలు కవల పిల్లలు. భార్య ఆరోగ్యం సక్రమంగా ఉండకపోవడంతో ఇద్దరు ఆడపిల్లల భారం తానే మోయాల్సి వస్తుందని తండ్రి వెంకటేశం గత కొంత కాలం కిందట చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తల్లి పార్వతి వారు 7వ తరగతి చదువుతుండగానే ఆరోగ్యం క్షీణించి మరణించింది. దీంతో ఇద్దరు ఆడపిల్లలు అనాధలయ్యారు. దీంతో ఈ ఇద్దరిని గ్రామస్తులు, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయుల సహకారంతో సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో చేర్పించారు. రాధ, రాధిక గోడు తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఈ ఇద్దరినీ తానే దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు.

అంతేకాదూ, పుట్టెడు దు:ఖం, కష్టాల కడలిలో ఉన్న ఆ ఇద్దరి జీవితాల్లో ఆనందాన్ని నింపడానికి కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి వారికి నాన్నయ్యాడు. • 2017నుంచి వారి బాగోగులన్నీ కలెక్టరే చూసుకుంటున్నాడు. సిద్ధిపేట బాలసదన్‌లో చేర్పించాడు. ఈ కవలలిద్దరూ బాల సదన్‌లో ఉండి విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా నిత్యం ఎంతో బిజీగా ఉన్నప్పటికీ…ఏమాత్రం వీలుదొరికినా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి మాత్రం దత్తత తీసుకున్న ఆ కవలల బాగోగులను స్వయంగా పర్యవేక్షించడమో లేదంటే వారినే తన కార్యాలయానికి, ఇంటికి పిలిపించుకుని యోగ క్షేమాలు తెలుసుకోవడం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పిల్లలకు ప్రతీ పుట్టినరోజు, పండుగలకు కొత్త బట్టలు తేవడం, ఇతర పిల్లలతో పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా పెరిగిన పిల్లలు ఇప్పుడు సిద్ధిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్నారు.

Venkatramareddy, the collector who adopts and reads orphaned children

ఘనంగా దత్తత పుత్రికల బర్త్‌డే వేడుకలు..వాచ్‌లు బహుకరణ
నాకు మీరు స్వంత బిడ్డలే…మీకు ఏలోటు రానివ్వను: కలెక్టర్‌
‌కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి దత్తత తీసుకున్న రాధ, రాధిక పుట్టినరోజు సోమవారం(మే 31) దత్త పుత్రికల 20వ జన్మదిన వేడుకలను సిద్ధిపేటలోని బాలసదన్‌లో కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి సమక్షంలో ఘనంగా జరిగాయి. సదన్‌లో పిల్లలు శుభాకాంక్షలు చెబుతుండగా జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి, దత్త పుత్రికలైన రాధ, రాధికలు కేక్‌ ‌కట్‌ ‌చేశారు. దత్తత పుత్రికల పుట్టిన రోజును పురస్కరించుకుని రాధ, రాధికకు కలెక్టర్‌ ‌చేతి వాచ్‌లను బహుకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ…దత్తత పుత్రికల పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి కొంత ఎమోషనల్‌ అయ్యాడు. మీరు కూడా నా స్వంత బిడ్డల మాదిరేననీ, మీకు ఏ లోటు రానివ్వను. ఉన్నత విద్యాభ్యాసం పూర్తయ్యే వరకూ అండగా ఉంటా. మీకు ఇష్టమైన రంగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి ఆకాంక్షించారు.

దేవుడులాంటి నాన్నకు మంచి పేరు తీసుకొస్తాం: దత్త పుత్రికలు రాధ, రాధిక
మీరు మాకు దేవుడు ఇచ్చిన మంచి మనసున్న కలెక్టర్‌ ‌నాన్న. మీకు మంచి పేరు తీసుకొస్తామని కవల దత్త పుత్రికలు రాధ, రాధికలు అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ‌దత్త పుత్రికలు, సదన్‌ ‌పిల్లలతో ఫోటోలు దిగారు. బాలసదన్‌ అవరణలో శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో షటిల్‌ ‌కోర్టు నిర్మాణంకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి కి కలెక్టర్‌ ‌సూచించారు. అలాగే ఆవరణలో డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్‌ ‌రాకతో…సదన్‌ ‌చిన్నారుల్లో సంతోషం వెళ్లి విరిసింది. మొత్తంగా కలెక్టర్‌ ‌దత్తత పుత్రికలు రాధ, రాధిక బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, అనాధలైన కవలల్ని దత్తత తీసుకుని వారికి ఏలోటు రాకుండా సొంత డబ్బులతో ఉన్నత చదువులు చదివిస్తున్న కలెక్టర్‌ ‌గొప్ప మనస్సును ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

ప్రభుత్వాధికారులు చాలా మంది ఉంటారు. కలెక్టర్‌ అం‌టే ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి వేరే చెప్పనక్కర్లేదు. అయితే, కన్నవారే కాదని వెళ్లడంతో అనాధలైన కవలల్ని మెజిస్ట్రేట్‌ ‌హోదాలో ఉన్న వెంకట్రామరెడ్డి దత్తత తీసుకుని వారి బాగోగులన్నీ చూసుకుంటూ…ఉన్నత చదువులు చదివిస్తూ ఆ అనాధ కవల పిల్లలకు దేవుడయ్యాడు. అయితే, దేవుడు ఎక్కడో ఉండడు. ఎదుటి వారి నుంచి కష్టం అనే మాట నోటి నుంచి వినిపించినప్పుడు చేరదీసి, ఆదుకున్నవాడే దేవుడు. అందుకే సిద్ధిపేట కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డీ నిజంగా నువ్వు దేవుడివి సామీ… ఇదిలా ఉంటే, కలెక్టర్‌ ‌దత్తత పుత్రికల బర్త్‌డే వేడుకల్లో జిల్లా సంక్షేమ అధికారి కె.రామ్‌గోపాల్‌రెడ్డి, బాలసదన్‌ ‌పర్యవేక్షకురాలు విజయలక్ష్మీ, జిల్లా చైల్డ్ ‌ప్రొటెక్షన్‌ అధికారి కె.రాము, బాలరక్షభవన్‌ ‌కోఆర్డినేటర్‌ ‌మమత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply