Take a fresh look at your lifestyle.

మాట సాయం కూడా చేయలేని స్థితిలో వెంకయ్య

ఉపరాష్ట్రపతి కావడంతో విశాఖ ఉక్కుపై మౌనం
కేంద్రంతో సమన్వయం చేసే వ్యక్తి లేక నేతల సతమతం

విశాఖపట్టణం, ఆగస్ట్ 4 : ‌భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బాధ్యతలు చేపట్టాక, రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక పోవడంతో ఆ పరిణామం ప్రభావం నవ్యాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. నవ్యాంధ్రగా అభివృద్ది చెందుతున్న దశలో ఇక్కడి వివౄఖ స్టీల్‌ను అమ్మాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు. అలాగే దీనిని ఆపే ప్రయత్నాలు కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. పార్టీలో లేదా కేబినేట్‌లో ఉండివుంటే ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేది. ఇప్పుడు విశాఖ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉననారు.ప్రభుత్వంలో నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేకపోవడంతో ఓ రకంగా కేంద్ర రాష్ట్ర సబంధాలు బెడిసి కొట్టాయన్నా భావన కలుగుతోంది.  దానిపై ఆంధ్రప్రదేశ్‌ ఎం‌పీలు, మంత్రుల్లో తర్జనభర్జన నడుస్తోంది. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టడంతో గత నాలుగేళ్లుగా ఎపికి శాపంగా మారిందన్న భావన కలిగింది. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో ప్రత్యక్షంగానే దాని ప్రభావం కనిపిస్తోంది. ఆయన మంత్రిగా ఉండివుంటే ఎపిలో ఇలాంటి పరిస్థితులు ఉత్పతన్నం అయ్యేవి కావని అంటున్నారు. ఈ పరిణామంపై రాష్ట్ర ఎంపీలు, రాజకీయ వర్గాల్లో భిన్నమైన కోణంలో చర్చలు జరుగుతున్నాయి. కొత్తగా పురుడు పోసుకున్న నవ్యాంధ్రకు తీరని నష్టమేనని  ఆందోళన చెందినదే ఇప్పుడు నిజమయ్యిందంటున్నారు.

2014లో కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ‌తరపున గట్టిగా నిలబడి ప్రతి సందర్భంలోనూ ఆయన తన వంతు సాయం అందిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక . రాజ్యాంగ పరిమితులకు లోబడి.. గతంలో మాదిరిగా క్రియాశీల పాత్ర పోషించలేని స్థితిలో ఉన్నారు. గతంలో ఏ సమస్యపై ఢిల్లీ వెళ్లినా ఆయన ఒక పెద్ద అండగా ఉండి సహాయపడేవారు. ఇతర మంత్రులతో కలసి మాట్లాడే వారు.  మమ్మల్ని కేంద్ర మంత్రుల వద్దకు తీసుకెళ్లేవారు. లేదంటే వారినే పిలిపించుకుని మాట్లాడించేవారు. అపరిష్క•తంగా ఉన్న సమస్యలు పరిష్కారం కావడంలో ఆయన పాత్ర ఉంది. ఉప రాష్ట్రపతి కావడంతో ఇప్పుడు ఆయన ఇంత క్రియాశీలంగా ఉండడం లేదన్న బాధ స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. ఉపరాష్ట్రపతి •దాలో ఒక రాష్ట్రంలోఉన్న సమస్య  కోసం ప్రయత్నించడం ఆయనకూ ఇబ్బంది అవుతుందని ఒక ఎంపీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక •దా ఇవ్వలేమని, దాని బదులు ప్రత్యేక సాయం ఇస్తామని కేంద్రం ప్రకటించిన సందర్బంలో వెంకయ్య పాత్రా ఉంది. ఇప్పుడు దానిపై గట్టిగా పోరాడినా ఫళితం లేకుండా పోయింది. అలాగే విశాఖ స్టీల్‌ను అమ్మొద్దని చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర విభజన ముందు రాజ్యసభలో జరిగిన చర్చలో వెంకయ్య చురుగ్గా పాల్గొన్నారు. ఎపికి అన్యాయం జరక్కుండా స్పందించారు. ఆ రోజు బీజేపీ తరపున ఇచ్చిన హాలను, ఇక్కడి అవసరాలను ఆయన తమ కేంద్ర నాయకత్వం లేదా ప్రధాని కార్యాలయం దృష్టికి తేగలిగారు. కానీ ఇప్పుడు కేంద్రం దృష్టిలో దేశంలోని 29 రాష్టాల్లో్ర నవ్యాంధ్ర కూడా ఒకటి. ప్రతి రాష్ట్రం నిత్యం కేంద్ర సాయం కోసం ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. కొత్త రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం భారీ నిర్మాణాలకు సంకల్పిస్తోంది. అదే సమయంలో పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను కూడా వేగంగా నడిపిస్తోంది. కేంద్రం ఇచ్చే సాయంపైనే వీటి పురోగతి ఆధారపడి ఉంది. ఈ సమయంలో వెంకయ్య ఉప రాష్ట్రపతి పదవిలో ఉండడం కారణంగా అనేక విషయాల్లో పెద్దన్న పాత్ర పోషించేవారు లేకుండా పోయారు. ఇప్పుడు అందరినీ ఇదే కలవరానికి గురి చేస్తోంది.

Leave a Reply