
మేడారం జాతర మరో వారం రోజుల్లో జరుగనుండటంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో రద్దీ అధికమైంది.ఆదివారం రాత్రి నుండి సోమవారం రాత్రి వరకు లక్షకు పైగా భక్తులు శ్రీస్వామివారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం,పరిసరాలు, మేన్‌రోడ్డు, గుడిచెరువులోని పార్కింగ్ స్థలాలు పూర్తిగా కిక్కిరిసిపోయాయి.వేలాది భక్తులు ధర్మగుండంలో స్నానాలాచరించి,శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి,కోడె మొక్కులు చెల్లించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు.ఈ రద్దీని గమనించి, మహామండపంలో లఘు దర్శనం అమలు చేసి,శ్రీస్వామివారిని దర్శించుకున్న భక్తులను త్వరితగతిన బయటకు పంపించారు.శ్రీస్వామివారిని దర్శించుకున్న భక్తులు వెంటనే బద్దిపోచమ్మకు బోనాలను సమర్పించడానికి బారులు తీరడంతో బద్దిపోచమ్మ వీధి కిక్కిరిసిపోయిం ది.కాగా భక్తులు ప్రయాణించిన వాహనాలతో జాత్రాగ్రౌండ్,గుడిచెరువు పార్కింగ్ స్ధలాలు వాహనాలతో నిండిపోయాయి.ఈ వాహనాల నీడనే భక్తులు సేదతీరారు.దేవస్థానం గదులు,ప్రైవేట్ లాడ్జిలు పూర్తిగా ని•డిపోవడంతో వేలాది భక్తులు ఖాళీ స్థలాలు ఎక్కడ కనబడితే అక్కడే మకాం వేశారు.
దైవదర్శనం, మొక్కులు పూర్తి చేసుకున్న భక్తులు తిరుగు పయనం కాగా వేములవాడ మేన్ బస్‌స్టేషన్ సైతం కిక్కిరిసిపోయాయి.భక్తలు బస్సులకోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది.ఆర్టీసి వారు బస్సుల సంఖ్యను పెంచడంలో ఆసక్తి కనబరచక పోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Tags: vemulavada, rajanna, temple, medaram jathara