Take a fresh look at your lifestyle.

వేగుచుక్క భగత్‌ ‌సింగ్‌

“‌దేశ దాస్య శృంఖలాలను తెంచడానికి లేత మీసాల వయసున ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌ అం‌టూ
ఉరికొయ్యను ముద్దాడిన   నెత్తురు  సంతకం సర్దార్‌ ‌షాహిద్‌ ‌భగత్‌ ‌సింగ్‌. ‌నేడాయన  జయంతి. 24వ ఏట  దేశభక్తికి, త్యాగనిరతికి ,లౌకిక విలువలకు ఉత్తమ ఆదర్శానికి ప్రతీక. భారత వేగుచుక్క. యువతరానికి  మార్గదర్శకుడు. విప్లవ ధ్రువతార 114వ జయంతి సందర్భంగా …..”

‘‘అత్య చారాల నెల అంతమొంది ంచాలని
 ఆకాశాన్ని నిందించడం దేనికి?
 లోకమంతా అన్యాయం నిండి ఉంటే
 రా! ఎదుర్కొని పోరాడుదాం
 పొద్దుపొడుపు సూచించే వేగుచుక్కనై
 ఆరిపోవడం అంటే భలే ఇష్టం… నాకు
 అంటూ’’
తమ్ముడు కుల తార్‌ ‌సింగ్‌ ‌కి  ఉద్బోధిం చిన విప్లవ వీరుడు భగత్‌ ‌సింగ్‌ ‌సెప్టెం బర్‌ 23, 1907 ‌న కిషన్‌ ‌సింగ్‌, ‌విద్యావతి దంప తులకు రెండో సం తానం. నేటి పాకి స్తాన్‌  ‌లాయల్‌ ‌ఫుల్‌ ‌జిల్లా బంగా లో ఉదయించిన అరుణ కిరణం. ఉద్యమకారులైన తండ్రి కిషన్సింగ్‌, ‌చిన్నాన్న లు అజిత్సింగ్‌, ‌స్వర్ణ సింగ్‌ ‌ముగ్గురూ ఆ సమయంలో జైల్లో ఉన్నారు. కాకతాళీయంగా తండ్రి కిషన్‌ ‌సింగ్‌, ‌చిన్నాన్న  స్వర్ణ సింగ్‌ అదే రోజున జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు.. నాయనమ్మ జమకౌర్‌  ‌బాలునికి భగత్‌ ‌సింగ్‌ అని నామకరణం చేసింది.. భగత్‌ అం‌టే భక్తుడు అని అర్థం. బంగా గ్రామ ప్రాథమిక పాఠశాలలో చదువుకోడానికి తన నాలుగవ ఏట చేరాడు. భగత్‌ ‌సింగ్‌   ‌తాత అర్జున్‌ ‌సింగ్‌  ఆర్య సమాజ పద్ధతి ప్రకారం మనవడికి ఉపనయనం చేసి మనవణ్ణి• దేశానికి అంకితం చేస్తున్నాను అని ప్రకటించాడు.

భారతదేశంలో గదర్‌  ఉద్యమం విఫలంకాగా, ఉద్యమ నాయకుడు కర్తార్‌ ‌సింగ్‌ ‌శరభానిని  20 ఏళ్ళ వయసులోనే బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఉరికంబానికి  వేలాడదీసింది.  1919  ఏప్రిల్‌ ‌లో  కొత్త సంవత్సరం వైశాఖిన అమృతసర్‌ ‌లో రౌలత్‌ ‌చట్టానికి వ్యతిరేకంగా జలియన్‌ ‌వాలా బాగ్‌ ‌లో సభకు  నిర్ణయించారు.. వేలాదిమందితో సభ జరుగు తుండగా పంజాబ్‌ ‌లెఫ్ట్నెంట్‌ ‌గవర్నర్‌ ‌డయ్యర్‌ ‌సేనాని  ఆధ్వర్యంలో బ్రిటిష్‌ ‌సైనికులు ఎటువంటి హెచ్చరికలు లేకుండా నిరాయుధులపై   విచక్షణ రహితంగా కాల్పులు జరపగా పెద్దసంఖ్యలో మృతిచెందారు. వేలాది గాయపడ్డారు. ఆనాటి కి భగత్‌ ‌సింగ్‌ ‌కి 12 ఏళ్లు. మర్నాడు సకాలంలో స్కూల్‌ ‌కి వెళ్ళిన వాడు, ఇంటికి పోకుండా నేరుగా  బస్సు ఎక్కిఅమృత్సర్‌ ‌వెళ్లి జలియన్‌ ‌వాలా బాగ్‌ ‌ని దర్శించి చనిపోయిన వారి నెత్తురుతో తడిసిన మట్టిని పిడికెడు తీసుకొని వీర తిలకం దిద్దుకు న్నాడు.

భగత్‌  9‌వ తరగతి చదువుతున్నప్పడు మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు  14 ఏళ్ల వయసులో విదేశీ వస్త్రాలు తెచ్చి వీధిలో పోగుచేసి నిప్పంటించేవాడు. చౌరా చౌరీలో  ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీ ఉద్యమాన్ని  ఉప సంహరించారు. అప్పుడు, కర్తార్‌ ‌సింగ్‌ ‌మార్గమే సరైనదని భగత్‌ ‌సింగ్‌  ‌భావించాడు. భగత్‌ ‌సింగ్‌ ‌కు తెలియకుండా తండ్రి పెండ్లి ఏర్పాట్లు చేస్తాడు కిషన్‌ ‌సింగ్‌. ఈ ‌విషయం తెలుసుకుని పదహారవ యేట రాత్రికిరాత్రి లాహోర్‌ ‌విడిచి ఢిల్లీ చేరాడు.       అక్కడ హిందీ పత్రిక వీరు అర్జున్‌ ‌లో విలేకరిగా ప్రవేసించాడు.  తరువాత, హిందీ దినపత్రిక ‘‘ప్రతాప్‌’’ ‌లో  కొద్ది కాలం…..  తరువాత కాన్పూర్‌ ‌నుంచి లాహోర్‌ ‌తిరిగొచ్చాక భగత్‌ ‌సింగ్‌ ‌నవ జవాన్‌ ‌భారత్‌ ‌సభ నిర్మాణ్‌ ‌సంస్థను స్థాపించి, యువతలో దేశభక్తి ప్రేరేపించారు. సంస్థకు ప్రధాన కార్యదర్శిగా భగత్‌ ‌సింగ్‌ , ‌ప్రచార కార్యదర్శిగా భగవతి చరణ్‌ ‌వోహ్రా  పనిచేశారు. 1928 సెప్టెంబర్‌ 8, 9 ‌తేదీలలో ఢిల్లీ ఫిరోజ్షా కోట్లాలో జరిగిన విప్లవకారుల సమావేశానికి చంద్రశేఖర్‌ ఆజాద్‌ అని వార్య కారణాల వల్ల హాజరు కాకపోడంతో సమావేశాన్ని భగత్‌ ‌సింగ్‌ ‌నిర్వహించి పార్టీ పేరును  హిందుస్థాన్‌ ‌సోషలిస్ట్ ‌రిపబ్లికన్‌ అసోసియేషన్‌, ‌సైనిక విభాగానికి హిందుస్థాన్‌ ‌సోషలిస్ట్ ‌రిపబ్లికన్‌  ఆర్మీ అని పేరు పెట్టారు.  భగత్‌, ‌విజయ్‌ ‌కుమార్‌ ‌సిన్హా  రాష్ట్రాల మధ్య సమన్వయ కర్తలుగా,  కమాండర్‌ ఇన్‌ ‌చార్జ్ ‌గా చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‌నియమితులయ్యారు..      లాహోర్‌ ‌కు వచ్చిన   సైమన్‌ ‌కమిషన్‌ ‌బహిష్కరిస్తూ  కాంగ్రెస్‌ ‌పార్టీ, నవ జవాన్‌ ‌భారత్‌ ‌సభ, విద్యార్థి యూనియన్లు  లాలా లజపతిరాయ్‌ ఆధ్వర్యంలో వేలాది మంది నిరసన ప్రదర్శన జరపగా, పోలీస్‌ ‌సూపరిండెంట్‌  ‘‘‌స్టాట్‌’’ ఆదేశాల మేరకు లాఠీచార్జి జరగగా లజపతి రాయ్‌ ‌చేతి మీద భుజాల మీద బలంగా తగిలిన దెబ్బలకు తాళలేక లాలాలజపతి రాయ్‌ ‌మరణించారు. ప్రతీకారంగా 1928 డిసెంబర్‌ 17 ‌న రాజ్‌ ‌గురు, భగత్‌ ‌సింగ్‌   ‌సాండర్స్ ‌ను పట్టపగలు కాల్చి  చంపారు.

1929 ఏప్రిల్‌ 8‌న ఢిల్లీ అసెంబ్లీలో  పబ్లిక్‌ ‌సేఫ్టీ బిల్‌,  ‌ట్రేడ్‌ ‌డిస్ప్యూట్స్ ‌బిల్‌  ‌రెండింటిని అసెంబ్లీ తిరస్కరించినా, వైస్రాయ్‌ ‌తన విశేష అధికారాలతో రెండు బిల్లుల్ని  పాస్‌ ‌చేసినట్టు   ప్రకటించగానే విజిటర్స్ ‌గ్యాలరీ నుండి భగత్సింగ్‌ , ‌బట్‌ ‌కేశ్వర దత్‌  అసెంబ్లీ హాల్లో బాంబులు విసిరి, కరపత్రాలు విసిరి, ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌ అం‌టూ నినదించారు. చాలామంది విప్లవకారులు అరెస్టయ్యారు. పోలీస్‌ ‌విచారణలో ఏడుగురు విప్లవ కారులు  అసలు రహస్యం చెప్పడంతో సాండర్స్ ‌హత్య కేసు, అసెంబ్లీ బాంబుకేసులో భగత్‌ ‌సింగ్‌ ‌కీ , బట్కేసర్‌ ‌దత్‌ ‌కి  ద్వీపాంతర వాస యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.  లాహోర్‌ ‌కుట్ర కేసు లో  అక్టోబర్‌ 6, 1930‌న   ట్రైబ్యునల్‌ ఏకపక్షంగా  భగత్‌ ‌సింగ్‌, ‌రాజ్‌ ‌గురు,  సుఖ్‌ ‌దేవ్‌ ‌లకు  ఉరిశిక్ష, ఏడుగురికి యావజ్జీవ ద్వీపాంతర వాసం  తీర్పు ఇచ్చింది. తీర్పు తర్వాత  భగత్‌ ‌సింగ్‌,  ‌సుఖ్‌ ‌దేవ్‌.,  ‌రాజ్‌ ‌గుర్‌ ‌ని  ఉరితీసే స్థలానికి మార్చారు. భగత్‌  ఆసమయాన్ని గ్రంథ అధ్యయనంలో గడిపాడు. ఒక రోజు ముందుగానే నియమ నిబంధనలకు విరుద్ధంగా  (లాహోర్‌ ‌కాంగ్రెస్‌ ‌మహాసభ జరుగుతున్న  నేపథ్యంలో) మార్చి 23, 1931 సాయంత్రం 7 గంటలకు దేశ దాస్య విముక్తి కోసం ఆ ముగ్గురు నవ యువకులు ముగ్గురు బ్రిటిష్‌ ‌పోలీసుల చర్యకు బలయ్యారు. …

దేశ   స్వాతంత్రం కోసం , ప్రాణాలర్పించిన అమరవీరుల ఎన్నటికీ త్యాగాలు వృథా కావు. వారి ఉరి రద్దు కోసం అప్పుడున్న జాతీయ నాయకులు పట్టించుకోకపోవడం   విచారకరం . దేశంలో  చీకటిలో మగ్గుతున్న పీడితులకు పొద్దుపొడుపు సూచించే వేగుచుక్క ఆరిపోవడం చాలా బాధాకరం. ప్రజా విప్లవకారుడిగా ఎదిగిన భగత్‌ ‌సింగ్‌    ‌విశ్వరూపాన్ని భారత ప్రజలకు యువతరానికి తెలియకపోవడం బాధాకరం. దేవుడు ,మతం, దైవ శక్తులునూ అజ్ఞానం ఫలితమేనని, . ఆ ఆలోచన మనసులో ప్రవేశిస్తే ఆత్మ విశ్వాసం పూర్తిగా నశించిపోయి మనిషి భయంతో జీవిస్తూ ఉంటాడని భగత్‌ ‌సింగ్‌అభిప్రాయం. అస్పృశ్యత నివారణకు సంస్కరణలు కాదు పరిష్కారం, వ్యవస్థ మీద తిరుగుబాటు మాత్రమేనని భగత్‌ ‌సింగ్‌ అన్నారు. ఆయన నిర్మించాలనుకున్న సమాజ సౌధం కోసం పోరాడే వారే ఆయన నిజమైన వారసులు… అదే పొద్దుపొడుపు సూచించే వేగుచుక్కకు నివాళి..

thanda sadhanandha
తండా సదానందం

 

 

Leave a Reply