Take a fresh look at your lifestyle.

కూర‘గాయాలు’

కూరగాయల ధరలు చుక్కల్లో చేరి..
జన గుండెల్లో దడదడలు పుట్టించె..
పొట్లకాయ రేట్లు పాములా బుస కొట్టే..
కాకరకాయ రేట్లు చేదును రుచి చూపే..
సోరకాయ ధరలు పందిరెక్కి నవ్వె..
బీరకాయల వెలలు చాకులా కోతవేసె..
టమాటాను చూడ కండ్లు ఎర్రబడె..
ఆకుకూరల ధరలు అటకెక్కి కూర్చునె..
బెండకాయను తాక జిగురు చేతికందె..
దొండకాయలు నేల విడిచి సాముచేసె..
పేదోడి పొయ్యిలో పిల్లుల మ్నెద్దు నిద్రలు
కంచంలో చూడ గొడ్డుకారపు ముద్దలు
కరోనా కన్న కూరల ధరలకు భయాలు
కూరగాయల ధరలకు జేబుల చిల్లులు
చారెడు పైసలకు పిరికెడు కూరగాయలు !

 – డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
   కరీంనగర్‌ ,9949700037

Leave a Reply