Take a fresh look at your lifestyle.

‘‘‌మనిషి ఆరోగ్యానికి శాకాహారమే మేలు

మనిషి ఆరోగ్యానికి శాకాహారమే మేలు చేస్తుంది. అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో అధిక శాతం శాకాహారమే ఉం డాలి. ప్రాచీనకాలం నుంచి నేటి వరకు శాకాహారమే ఎక్కువమంది ఇష్టపడుతున్నారంటే శాకాహారంతో ఆర్యో గానికి ఎన్ని లాభా లున్నాయూ అర్థమవుతుంది. వైద్యులు నయం చేయని జబ్బులు కూడా శాకాహారం తింటే నయమ వుతాయి.అందుకే శాకాహారం మానవ జీవితంతో పెనవేసుకుపోయింది. అందుకే అక్టోబర్‌ ఒకటిన ‘’వెజిటేరియన్‌ ‌డే’’గా జరుపుకుంటున్నారు.

సంప్రదాయ ఆహారంలో శాకాహారమే ఎక్కువ. సహజంగానే ప్రకృతి లో ఆకుకూరలు, కూర గాయలు, పండ్లతో అధిక ప్రయోజనాలున్నాయి. నగరంలో ఇప్పడిపుడే శాకాహారంపై పెరు గుతుంది. విదేశాల మాదిరి మనం పూర్తిగా మాంసాహారులం కాకపోయినప్పటికీ ఆరోగ్యంపై శ్రద్ధతో శాకాహారం వైపు రానురాను చాలామంది మొగ్గు చూపుతున్నారు. మారిన జీవనశైలి నేపథ్యంలో ఆహార నియమాల్లో మార్పులు కనిపి స్తున్నాయి. తినేది శాకాహారమైనా రోజూ వైవిధ్యం ఉండాలి. శాకాహారం తక్కువ ఖర్చుతో కూడుకున్నది: మాంసాహారం కన్నా శాకాహారానికి చాలా తక్కువ ఖర్చవుతుంది. తొందరగా జీర్ణ మవు తుంది. ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మనిషి పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే అతడు తప్పకుండా శాకాహారియై ఉండాలని పెద్దలు చెబుతున్నారు.

రోజు శాకాహారం ఎలా తీసుకోవాలి? ఏ సమయంలో ?

1. ఉదయం: ఉదయం లేచి అల్పాహారం తీసుకోవాలి. ఇందులో విటమిన్‌ ‌బి ఎక్కువగా ఉన్న పదార్థాలైతే మేలు. ఇవి మెదడుకు అదనపు శక్తినిస్తాయి. పొట్టుతో కూడిన పదార్థాలతో తయారైన ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవాలి. ఇడ్లీ, పెసరట్టు, గోధుమ ఉక్మా, రొట్టెలు, దోశ, బౌన్‌‌బ్రెడ్‌, ‌జొన్న వంటివి ఎంపిక చేసుకోవాలి. ఖనిజ లవణాలున్న యాపిల్స్, ‌నారింజ, క్యార్ఱెట్‌, ‌బాదం, పిస్తా తీసుకోవచ్చు
2. మధ్యాహ్నం: అన్నం, గోధుమ రొట్టెలు తీసుకోవాలి. ఐరన్‌ ‌కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తినాలి. కూరల్లో పాలకూర, ఆకుపచ్చటి కూరగాయలు తినాలి.వీటిలో ఏకాగ్రతకు అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
3. సాయంత్రం: ఫలాల్లో బీటా కెరోటిన్‌ ‌నిండుగా ఉంటుంది. సాయంత్రం వేళ ఫలాలను అల్పహారంగా తీసుకోవాలి. పండ్లతో పాటు ప్రొటీన్లు అధికంగా ఉండే పల్లీ పట్టీలు తినచ్చు.పండ్ల రసాలు తాగవచ్చు. జీర్ణశక్తిని, రోగ నిరోధక శక్తిని పెంచడంలో పండ్ల రసాలు తొందరగా పనిచేస్తాయి.
4. రాత్రి: బియ్యం, పప్పు ధాన్యాలతోపాటు ఆకు కూరలు తీసుకోవాలి. భోజనానికి నాలుగు గంటల వ్యత్యాసముండాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పగలు కంటే రాత్రిపూట జీర్ణక్రియలు ఆలస్యంగా జరుగుతాయి.
ఆహార నియమాలు పాటిస్తే మనిషికి ఎలాంటి జబ్బులు రావు.

శాకాహారులు మూడు రకాలు:

1. మొక్కల నుంచి వచ్చే కాయగూరలు, పాల నుంచి వచ్చే పదార్థాలు తీసుకోంటారు. ల్యాక్టో ఓవో వెజిలేరియన్లు. 2. గుడ్డు తప్ప మిగతా అన్ని పదార్థాలు తీసుకొంటారు. ల్యాక్టో వెజిటేరియన్లు. 3. మొక్కల నుంచి వచ్చే పదార్థాలను మాత్రమే తీసుకోంటారు. పాలనుంచి వచ్చే మజ్జిగ, నెయ్యి. కూడా ముట్టరు. వెగన్స్ ‌వెజిటేరియన్లు.
ప్రయోజనాలు:
1.మొక్కల నుంచి వచ్చే ఆహారం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో విటమిన్స్, ‌మినరల్స్, ‌యాంటి ఆక్సిండెండ్స్ అధికంగా ఉంటాయి. వీటిలో మిటమిన్‌ ‌సి, ఎ పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి రోగ నిరోధక శక్తిని అందించే న్యూట్రియన్లు ఉంటాయి.
2. వీటిలో మరో ప్రయోజనం తక్కువ కేలరీలు. తీసుకునే ఆహారాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. పండ్లలో సహజంగానే ఇది తక్కువ వాటిని అటాగే తినగలుగుతాం. కూరగాయల్లో కొన్నింటిని పచ్చిగా తినగలం, మిగతావి వండి తినాల్సిందే. వండే విధానాన్ని బట్టి క్యాలరీల పరిమాణం మారుతుంది.
3. మరో ప్రయోజనం తక్కువ కొవ్వు. రక్తపోటు ఉన్న వారికి శాకాహారం మేలు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పొట్టకు మంచిది. కడుపు శుభ్రంగా ఉంటుంది. క్యాన్సర్‌, ‌గుండె పోటుతో బాధపడే వారికి మేలు. రోగ నిరోధక శక్తి శాకాహారంతో పెరుగుతుంది. వెజిటేరియన్‌ ‌జూస్‌ : ‌కూరగాయల రసాలు ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయి. వైద్యులు రోగులకు ఎక్కువగా వెజిటేరియన్‌ ‌జూస్‌ ‌తాగాలని సలహా ఇస్తారు. జూస్‌ ‌బాటల్స్ అం‌దుబాటులో ఉన్నాయి.

మాంసహారులు శాకాహారులుగా మారారు:

మాంసాహారులుగా ఉన్న చాలా మంది ఇప్పుడిపుడే పూర్తిగా శాకాహారులుగా మారుతున్నారు. మాంసాహారం వల్లన శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరగడంతో తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారు. వైద్యులు సలహాల మేరకు నేడు చాలా మంది శాకాహారం తింటున్నారు.శరీరం లో రోగ నిరోధక శక్తి బాగా పెంచుకోవాలంటె శాకహారమె మేలు.కరొనా ని వెల్లగొట్టడానికి శాకహారము నిత్యం తీసుకుని ఆరోగ్యం గా వుందాం.

Ravula Rajesham, Jammikunta, Karimnagar‌, Telangana Social Writers Association Secretary General of State
రావుల రాజేశం, జమ్మికుంట, కరీంనగర్‌, ‌తెలంగాన సామాజిక రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Leave a Reply