Take a fresh look at your lifestyle.

మండుటెండలకు కూరగాయల ధరలు పైపైకి

భూగర్భ జలాలు అడుగంటడంతో తగ్గిన దిగుబడులు
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌లాక్‌డౌన్‌ ‌పాక్షిక ఎత్తివేతతో మళ్లీ ప్రజలు రోడ్డెక్కారు. యధావిధిగా తమ పనుల్లో పడుతున్నారు. •టళ్లు టేక్‌ అవే ప్రారంభించారు. ఇప్పటికే చికెన్‌ ‌రేట్లు అదరగొడుతున్నాయి.  మండు వేసవి మరింత వేడెక్కి ఎండలు భగభగమండుతున్నాయి.. ఉదయం 10గంటల నుంచి వడగాల్పులు వీస్తున్నాయి. పది నిమిషాలు రోడ్డుపై తిరిగితే నడినెత్తి చుర్రుమంటోంది. నాలుక తడారిపోతోంది.. మనిషి పరిస్థితి ఇలా ఉంటే..ఇక జంతువులు చెట్టూ చేమా పరిస్థితి చెప్పాల్సి  లేదు. మార్కెట్లలో కూరగాయల ధరలు ఎండల తీరుగానే భగ్గుమంటున్నాయి. పంటల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు మెల్లగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు టమాటాలు పది లోపే కిలో ఉండగా ఇప్పుడు మెల్లగా 15 దాటింది. ఇక మిగతా కూరగాయలు కూడా కిలో 50-60 మధ్య పలుకు తున్నాయి. వ్యాపారులను అడిగితే పంట తగ్గిపోయిందని చెబుతున్నారు. ఒక పక్క ఎండ సెగ..మరో పక్క కూరగాయల ధరల మంట చూసి నగరవాసులు ఉసూరుమనాల్సి వస్తోంది.. ఎండల తీవ్రత కూరగాయల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. కూరగాయలు పండించే రైతులకు నీరందక వందలాది ఎకరాల్లో పంట ఎండిపోయి దిగుబడి తగ్గిపోయింది. కరోనాతో పంటలపైనా దృష్టి పెట్టలేకపోయారు. కూలీల కొరతతో పంటలను పొలాల్లోనే వదిలేశారు. ఫలితంగా కూరగాయల ధరలు పెరిగిపోయాయి. నిత్యం వాడే ఉల్లి ధరలు మళ్లీ 20పైనే పలుకుతన్నాయి.

ఎండాకాలంలో పంటల విస్తీర్ణం పరిమితమైంది. దిగుబడి కూడా సగానికి తగ్గి ఉత్పత్తి పడిపోయింది. దీంతో నగరానికిరావాల్సిన కూరగాయల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిందని అంటున్నారు. వేసవి ప్రభావం తీవ్రంగా ఉండటంతో భూమిలోని తేమ గంటల వ్యవధిలో ఆవిరవడంతో పంటలకు నీరు అందని పరిస్థితి. ఏర్పడుతోంది.  భూగర్భ జలాలు వేగంగా అడుగంటి పోవడంతో బోర్లు ఉన్నా పనిచేయడం లేదు. ఎండ తీవ్రతకు,వడ గాలులకు వచ్చిన పూత కూడా రాలిపోవడంతో కాయలుకాయడం లేదని అంటున్నారు. అన్ని కూరగాయల ధరలు దాదాపు ఇదే తీరులో పెరిగాయి. టమోటా, బీర, గోరు చిక్కుడు సాగు చేసిన రైతులు అప్పు చేసి  పెట్టుబడి పెట్టారు. తీరా  ఇప్పుడిప్పుడే కాపు మొదలైందనుకున్న దశలో ఎండలకు ఉన్న పంట కాస్తా చేతికందకుండా పోతోంది. ఎండ తీవ్రత కారణంగా పంట ఎండిపోయిది. పెట్టుబడి కూడా చేతికి వస్తుందన్న నమ్మకం లేదని కూరగాయల రైతులు వాపోతున్నారు. ఎండల తీవ్రత ఇదే స్థాయిలో ఉండి, వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత తగ్గిపోయి పంటలు ఎండిపోతాయి. ఇప్పటికే 80 శాతం కూరగాయల పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. దిగుబడి ఇంకా పడిపోయి మార్కెట్‌కు కూరగాయలు రావడం కష్టమయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయని నగర మార్కెట్లకు సరఫరా చేస్తున్న వ్యాపారులు అంటున్నారు. ఇలాగే ఎండలు కొనసాగితే ధరలు మరింతగా మండే ప్రమాదం కనిపిస్తోంది.

Leave a Reply