Take a fresh look at your lifestyle.

వీరనారికి..విప్లవ జోహార్‌

‌తెలంగాణా వీర తిలకం
రగల్‌ ‌జెండా లాల్‌ ‌రూపం
సాయుధ ఉద్యమ జ్వలనం
తన జీవితమే ఒక యుద్ధగీతం
ఆమే..కామ్రేడ్‌ ‌మల్లు స్వరాజ్యం

బాల్యంలోనే బందూకు చేతబట్టి
పోరెత్తిన మహిళా ఉద్యమకారిణి

నా మాటే తుపాకీ తూటా అంటూ
తెగించి నినదించిన వీరనారిమణి
తెలంగాణ సాయుధ పోరాటంలో
గెరిల్లాగా అవతరించిన శిరోమణి

భూస్వాములకు వ్యతిరేకంగా
సమరం సాగించిన విప్లవకారిణి

రజాకార్‌ ‌గూండాల గుండెల్లో
గుబులు రేపిన నవ ఝాన్సీరాణి

ఉద్విగ్న ప్రసంగాలు పాటలతో
జన జాగృతి చేసిన కళాప్రపూర్ణి

ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి
గళం విప్పిన ప్రజా సేవాసంపన్ని

భూస్వాముల ఇంట పుట్టినా
శ్రామిక వర్గం పక్షం నిలిచింది
జనంకై జీవితం దారబోసింది
త్యాగ జీవిగా  వినతికెక్కింది

తను నిష్క్రమించినా నినతం
స్ఫూర్తి దీపికలా ప్రజ్వలిస్తుంది

విప్లవ గీతికలా ప్రతిధ్వనిస్తుంది

మహోద్యమ శిఖరం
మల్లు స్వరాజ్యంకు

అరుణారుణ జోహారులు
అనంత జన నీరాజనాలు

(మల్లు స్వరాజ్యం మృతికి అక్షర నివాళి అర్పిస్తూ…)
కోడిగూటి తిరుపతి :9573929493

Leave a Reply