- కేంద్రమంత్రి షెకావత్‌కు టిడిపి నేతల వినతి
- ప్రకాశం జిల్లా వెనకబాటును గుర్తించాలని అభ్యర్థన
న్యూఢిల్లీ,అగస్టు 31 : వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రకాశం జిల్లా టిడిపి నేతలు వినతిపత్రం సమర్పించారు. వెలిగొండ ప్రాజెక్టు సమస్యపై టీడీపీ బృందం కేంద్రమంత్రిని కలిసింది. ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితి, ప్రాజెక్టు ప్రాధాన్యతను నేతలు కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో వెలుగొండ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రికి గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా కరువు కాటకాలు, ప్రజల ఇబ్బందులు, తాగు సాగునీటి సమస్యలను మంత్రి షెకావత్ కు వివరించిన టీడీపీ నేతల బృందం తక్షణం వెలుగొండ ప్రాజెక్టు కు అనుమతి కల్గిన ప్రాజెక్టుగా గెజిట్ లో చేర్చాలని కోరారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని మంగళవారం ఢిల్లీలో టీడీపీ నేతలు కలిశారు. జల్‌శక్తి మంత్రిని కలిసిన వారిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మల్యేలు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా వారు పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదన్నారు. తక్షణమే అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గెజిట్‌లో చేర్చాలని కోరారు. ప్రకాశం జిల్లాలో కరువు, ప్రజల ఇబ్బందులు, తాగు, సాగు నీటి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యలపై మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డా. డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేలు బోలినేని రామారావు, ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, బీఎన్. విజయ్‌కుమార్ ముత్తముల అశోక్ రెడ్డి, నేతలు గూడూరి ఎరిక్షన్ బాబు, దామచర్ల సత్య తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతలు తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టును గెజిట్ లో చేర్చే అంశంపై చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ నేతలు గతంలో విజ్ఞఫ్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మూడు పర్యాయాలు లేఖలు రాశారు. ఆ తరువాత ఏపి ముఖ్యమంత్రి చేతగానితనం, అసమర్థత కారణంగా వెలుగొండ ప్రాజెక్టుకు గెజిట్ లో చోటుదక్కలేదనీ, దీనిపై పదేపదే అభ్యంతరాలు తెలుపవద్దని కోరుతూ తెలంగాణ సీఎం కేసిఆర్ కూ వీరు లేఖరాశారు. చివరగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆపాయింట్మెంట్ తీసుకుని కలిసి వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు.