Take a fresh look at your lifestyle.

వర్ణ హేలా.. హోలీ మేలా

దేశ సంస్కృతికి దర్పణం
జాతి సమైక్యతకు సంకేతం
సర్వమత సమ్మేళన చిహ్నం
ఆధ్యాత్మిక విశ్వాస సందేశం
అదే.. హోలీ పర్వదినోత్సవం

ఫాల్గుణ పౌర్ణమి శుభవేళా..
హరివిల్లు ఇలపై విరిసినట్లు
హర్షజల్లు నేలపై కురిసినట్లు
ప్రకృతి సోయగం వన్నెలీనేను
ధరిత్రి  వసంతం అరివిరిసేను

సప్తవర్ణోత్సవ సమయాన
కుల మత జాతి, తేడాలేక
సకల జనావళి సమైక్యమై
ఏడ రంగులు చల్లుకుంటూ
ఆత్మీయ గంగలో మునిగేను
హర్ష గగనంలో విహరించేను

డోలీకోత్సవ తరుణాన
అబాలగోపాలం మమేకమై
చిందేస్తూ చిద్విలాసం చేస్తూ
ఆనంద ఆందోళికలో ఊగేను
ఆహ్లాదాల జగతిలో ఊరేగేను

రంగుల పండగ క్షణాల
బంధుమిత్రుల హాసాలు
ఆటపాటల కేరింతలతో
ఊరంత ఉత్సవ సందళ్ళు
జగమంత ఉల్లాస పొదరిల్లు

ఈ శుభ మంగళకర వేళా
సకల జనావళి  సమైక్యమై
సంతోషంగా జరుపుకుందాం
సంస్కృతి సాంప్రదాయ ప్రశస్తి
విశ్వజగతి ఎల్లెడల చాటుదాం
– కోడిగూటి తిరుపతి
    మొబైల్‌, 9573929493

Leave a Reply