Take a fresh look at your lifestyle.

వేరియంట్స్ పిల్లలలో అసమానంగా సోకినట్లు అధరాలు లేవు ..!

కేంద్ర ఆరోగ్య శాఖ లోక్ సభ లో స్పష్టీకరణ
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,జూలై 23: డెల్టా వేరియంట్‌ లేదా ఇతర కోవిడ్ -19 వేరియంట్స్ పిల్లలలో అసమానంగా సోకినట్లు నిరూపించే అధరాలు భారత్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడా చిక్కలేదు అని కేంద్ర ఆరోగ్య శాఖ లోక్ సభ కి తెలిపింది. పిల్లలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న డెల్టా వేరియంట్ రూపంలో కొరోనావైరస్ మూడవ వేవ్ రావడం గురించి ఆరోగ్య నిపుణులు ,అధికారులు ఏమని హెచ్చరికలు చేస్తున్నారు.. దేశవ్యాప్తంగా పిల్లలకు నాసల్ వ్యాక్సిన్ ఇవ్వడానికి దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్ ను ఉపయోగించడానికి ప్రభుత్వం ఏదైనా పథకాన్ని సిద్ధం చేస్తుందా..? అని ఎంపీ వై.స్. అవినాష్ రెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖను ప్రశ్నించారు.. దీనికి సమాధానంగా కొరోనా పిల్లలని విపరీతంగా ఇబ్బంది పెడుతున్న దాఖలాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. డెల్టా వేరియంట్‌తో సహా ఇతర కోవిడ్ -19 వేరియంట్స్ పిల్లలలో అసమానంగా సోకినట్లు నిరూపించే అధరాలు భారతదేశం నుండి లేదా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు. సోకినట్లయితే పిల్లలు సాధారణంగా లక్షణరహితంగా ఉంటారు.

లేదా తేలికపాటి లక్షణాలను ప్రదర్శిస్తారు.అంతే కాదు తీవ్రమైన వ్యాధి రాదు.అయినప్పటికీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది. పిల్లల కేసుల నిర్వహణకు సంబంధించి ఆరోగ్య మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు అందించిన వివరాల ప్రకారం దేశంలో కోవిడ్-19 పథాన్ని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. డెల్టా వేరియంట్ కోసం ప్రజారోగ్య విధానం మరియు క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నాం.

టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకాలు వేయడం మరియు కోవిడ్-19 నియమావళి పాటించటంకు కట్టుబడి ఉండటం అనే ఐదు అంచెల విధానం కోవిడ్-19 నియంత్రణకు వ్యూహంగా కొనసాగిస్తున్నాం. పిల్లలకు ఇంజెక్ట్ చేయగల వ్యాక్సిన్ విషయానికొస్తే, దేశంలో తయారీదారుల కోసం పిల్లలలో కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సీడీఎస్సీ ఓ అనుమతి ఇచ్చింది. .2021,ఫిబ్రవరి 12 నాడు హైదరాబాద్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఇంట్రానాసల్ అడెనోవైరల్ వెక్టర్ కోవిడ్-19 వ్యాక్సిన్ (BBV154) మొదటి దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీ ఓ) అనుమతి ఇచ్చింది.

Leave a Reply