Take a fresh look at your lifestyle.

’’వారెవా’’.!

“కడుపు నింపుకోవడానికి ముంబైకి చేరుకున్న వలసజీవి ’సంగివేని రవీంద్ర.’తెలుగు సాహిత్యం పై అభిరుచి,ఆసక్తితో కవిగా,రచయితగా, సంపాదకుడిగా మారాడు.సాహిత్యాన్ని వృత్తితో సంబంధంలేని ప్రవృత్తిగా చేసుకొని ప్రవాసుడైనా మహారాష్ట్రలో తెలుగు జెండాను రెపరెపలాడిస్తున్నాడు.”

సంగెవేని రవీంద్ర… మినీ కవితలు..

పేరుకు ముంబయి కవైనా…మన తెలుగువాడైన. సంగెవేని రవీంద్ర.సాహిత్యపరంగా ఇప్పటికే ఎన్నో మెట్లు ఎక్కేశాడు..ఈ ఆమ్చీ ముంబయి ఇప్పటికే 12 పుస్తకాలు తెచ్చాడు.మరో మూడు పుస్తకాల్ని  మరొకరితో కలిసి రచించాడు.ఇక ప్రవాస పక్క  రాష్ట్రంలో తెలుగు సాహిత్య కార్యక్రమాల్లో క్రియా శీలక పాత్ర పోషిస్తున్నాడు. అక్కడి కొన్ని తెలుగు పత్రికలకు సంపాదకుడిగా కూడా వ్యవహరించాడు.

ఇంటా బయటా తెలుగు సభల్లో,సెమినార్లలో పత్ర సమర్పణలు కూడా చాలానే చేశాడు.అలాగే .ముంబయి నుంచి వెలువడిన అనేక ప్రత్యేక సంచికలకు సంపాదక బరువు బాధ్యతల్ని కూడా మోసాడు. అలాగే ముంబయిలో పలు సామాజిక కార్యక్రమాల్ని ముందుండి నడిపించాడు.ఫలితంగా.’’కాళిదాస్‌ ‌సమ్మాన్‌ ‘‘‌బిరుదు అందుకున్న మహారాష్ట్ర తొలి తెలుగు కవిగా రికార్డుల్లోకి ఎక్కాడు…ఏపని చేసినా,ఎందులో పాల్గొన్నా కూడా.. అందరిచేత ‘‘వారెవా’’! అనిపించుకున్నాడు.ఇప్పుడు తన మినీ కవితలకు కూడా..’’వారెవా ‘‘! అని పేరు పెట్టుకున్నాడు.

ఈ సంపుటి లోని  మినీ కవితలు చదివాక నచ్చితే మాత్రం..మొదటి ‘‘వారెవా’! (మెచ్చుకోలు) అనండి.నచ్చక పోతే మాత్రం రెండవ వారెవా! (వ్యంగ్యం ) అనండని ఓపెన్‌ ‌గా చెబుతున్నాడు.మినీకవితలపై అభిప్రాయం ఎలా వున్నా…నెత్తినపెట్టుకుంటానంటు న్నాడు…మరైతే ఇక ఆలస్యం దేనికి..అదేదో చూసే ్త•…ఓ పనైపోతుంది కదా..!

ఇదోరవీంద్ర  15 వ పుస్తకం ..2020అక్టోబర్లో వెలు వడింది.ఇందులో మొత్తం 100 కవితలున్నాయి.
అన్నీ చిన్న కవితలే.

’’నా అక్షరం
ఆయుధం
కానక్కర్లేదు
అలార మైతే చాలు

నిద్ర లేచినోడు
యుద్ధం
చేయకుండా వుంటాడా ’’?

ఈ కవి పెద్ద ఆశపరుడేం కాదు..’’అక్షరాల్ని ఆయుధాలుగా మలిచి అన్యాయం కుత్తుకలను  తెగనరుకుతాను’’ అనేంత ఆవేశ పరుడూ కాదు.
కానీ చాలా… తెలివైనోడు.ఏ పనిచేసినా…త.తన చేతికి మట్టి అంటకుండా ..కాగల కార్యాన్ని చక్క బెట్టగల నేర్పరి..అక్షరాల కూర్పరి కూడా…అందుకే తన అక్షరం ఆయుధం కానక్కర్లేదు.కేవలం అలారం అయినా చాలు అంటున్నాడు.అలారమైతే మనిషి మొద్దు నిద్ర వదులుతాడు…నిద్రలేచినోడు ఎలాగూ యుద్ధం చేయకుండా వుంటాడా? చీవఙవతీ.!!
చూశారుగా ఈ ఆమ్చీ ముంబయి అక్షర తెలివి.!!

ఈ కవి ‘ రాసిన ప్రతీ అక్షరానికి సోయుండాలి.ఉప్పొంగే తరంగంలా జోరుండాలి..’ అనే తత్వం కలవాడు.అందుకే,

‘‘ఈ దేశంలో
పదవుల్లేని మేధావులు
ప్రజా పక్షమంటారు

పదవులెక్క గానే
పెదవులు
మూసుకుంటారు ‘‘..అనగలిగాడు.

ఈ రాజకీయ వ్యాఖ్య చిన్నదేం కాదు..లోకాన్ని ఎంతగా జల్లెడ పడితే గానీ…ఈ మాట అను భవంలోకి రాదు.

అలాగే..’ప్రపంచాన్ని చదవాలనుకున్నా..పుస్తకం
దొరికింది.ప్రపంచం తెలిసింది.’..అనడంలో  పుస్తకం విలువను రెండు మాటల్లో తేల్చేశాడు.

నేటి తరం రచయితలకు ఎలా వాతలు పెట్టాడో చూడండి.

 ‘‘కళ్ళుంటేనే
చూపులున్నట్టు కాదు..
పెన్ను ఉంటేనే
రాతలున్నట్టు కాదు..

చూపుల్లో
తడి వుండాలి
రాతల్లో
నిప్పుండాలి.’’..

కలానికి కులాన్ని అద్ది
కవిగా ఎదగాలనుకుంటే
ఎట్లా?

అక్షరాలు ?? అగ్ని కణాలు
మలినాలు అంటవని
తెలియదా!’’

మందిరాల పేరుతో చందాలు వసూలు చేసి దందాలుచేస్తున్న మాయదారి జనానికి కర్రు కాల్చి వాతలుపెట్టాడు.

‘‘చందాలివ్వండి
మందిరాలు కడతాం
మనుషుల్ని పాతరేసి
విగ్రహాలు పెడతాం..

చందాలు దందాలైనపుడు
మందిరాలు కాదు
ఆరోగ్యం కేంద్రాలు కావాలి’’అంటాడు.

అలాగే..’విడివిడిగా వున్నంత కాలం..మనం
మట్టిపాత్ర లమే..కలిసి కలబడినప్పుడు..
మనమంతా ముందు పాతరలమే’..
అనడం సఖ్యత,సమష్టితనం గొప్పదనాన్ని,బలాన్ని తెలియజేస్తోంది.
’బంధం ఏదైనా…గొప్పదే.
అది దిగ్బంధం కానంతవరకు..అనడంలో  ్వ•చ్ఛ,భావ ప్రకటనకున్న అవసరాన్ని చెప్పాడు.

‘‘ఇప్పుడే
ఓ  కుక్కను  తెచ్చాను
పెంచుకుందామనీ..

చిత్రం..
దాన్ని చూశాకే
నాలో మనిషి లక్షణాలు
కనిపిస్తున్నై..!’’

మనిషిలో లోపిస్తున్న విశ్వాసం,విధేయత,బాధ్యతలను ?? కుక్కలో చూడటం బాగుంది.!

అన్నీ…అనలేను కానీ..ఎక్కువ మినీ కవితలు చదివాక..మొదటిసారిగా..
వారెవ్వా’’!
అనకుండావుండలేక పోతున్నాను.

మరి మీరో..?

తెలుగు నేలలో లేకున్నా.. తెలుగు పట్ల ఇంత ప్రేమను పెంచుకున్న సంగెవేని రవీంద్రకు..
వందనం..అభివందనం.!!

వారెవా..
తెలుగు రైటర్స్ అసోసియేషన్‌, ‌మహారాష్ట్ర.
ప్రచురణ..
వెల..100/

కాపీలకు…
C V compound 7/4

Hanuman lane,
Lower Parel , Mumbai.400013
Cell..09987145310.
08356962974.

-ఎ.రజాహుస్సేన్‌..!!

Leave a Reply