Take a fresh look at your lifestyle.

వివి విడుదల

భీమా కోరేగావ్ కేసులో రెండు సంవత్సరాలుగా అక్రమ నిర్బంధంలో ఉన్న విప్లవ కవి ,విరసం వ్యావస్థాపకుల్లో ఒకరు..వరవర రావు  బెయిల్ దొరికిన రెండు వారాల తర్వాత వివిధ  ఆంక్షలతో  చిట్టచివరికి  శనివారం రాత్రి దాదాపు పన్నెండు గంటలకు నానావతి  హాస్పిటల్  నుంచి విడుదల చేశారు. తలోజా జైలు అధికారులకు సాయంత్రం నాలుగు గంటలకే విడుదల ఉత్తర్వులు అందించగా రాత్రి   పదకొండింటికి హాస్పిటల్  చేరుకుని ఆ తర్వాత విడుదల చేశారు. బొంబాయి ఎన్ ఐ ఎ స్పెషల్ కోర్టు పరిధి దాటి వెళ్లగూడదనీ, ఆ పరిధిలోనే నివసించాలనీ,  ఈ బెయిల్ ఆరు నెలల కోసం మాత్రమేననీ, ఆరు నెలలు కాగానే తలోజా జైలు అధికారులకు లొంగిపోవాలనీ, బొంబాయి హైకోర్టు బెయిల్ ఉత్తర్వులు నిర్దేశిస్తున్నాయి.

Leave a Reply