Take a fresh look at your lifestyle.

అనారోగ్యంగా ఉన్నా వరవరరావును చికిత్సకోసం హైదరాబాద్ కు తరలించాలి. *పౌర హక్కుల సంఘం,తెలంగాణ

గత మూడు రోజులుగా వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా ల ఆరోగ్యాలపై ఆందోళనలు నెలకొనిఉన్నాయ్. 28 మే 2020 నాడు బాంబేలోని జే.జే హాస్పిటల్ లో వరవరరావు గారిని అడ్మిట్ చేసినారని, 29 మే,2020 రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాదులోని చిక్కడపల్లి పోలీసులు ,వరవరరావు కుటుంబ సభ్యులకు కేవలం వరవరరావు అనారోగ్యం గురించి సమాచారం మాత్రమే ఇచ్చినారు. రాత్రి 10- 11 గంటల ప్రాంతంలో తెలంగాణ పోలీసులు  ప్రత్యేక పాసులు ఇఛ్చి వరవరరావు బంధువులను బాంబే పంపించే   ప్రయత్నం చేసినట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది.అది కార్యరూపం దాల్చలేదని స్పష్టమయింది. ఏది ఏమైనప్పటికీ వరవర రావు గారి వయసు  81 సంవత్సరాలు దాటినందున,వరవరరావు కు ఉన్నా పైల్స్ వ్యాధి, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, కరోనరీ artari డిసీజ్ ఎడీమా హైపర్ టెన్షన్, అసిడిటి, సైనస్/ మైగ్రేన్ లలో ఏ సమస్య తీవ్రంగా మారి ప్రస్తుత ఆందోళన కర పరిస్థితి కల్పించిందో లేదా ఏ కొత్త సమస్య తలెత్తిందో, వైద్య బృందం చేత సమగ్ర పరీక్ష జరిపించి చికిత్స చేయించాలి కేంద్ర, తెలంగాణ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున వరవరరావు ను వెంటనే విడుదల చేసి హైదరాబాద్ కు పంపించాలని, న్యాయ స్థానం ద్వారా అతనికి రక్త సంబంధీకుల తో కలిసి ఉండేటట్లు అవకాశం కలిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని,తెలంగాణ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేస్తున్నాము.  భీమా కోరేగావ్ కుట్రకేసులోని అనుమానితులందరు సుమారు 60 ఏండ్ల వయసు పైబడిన వారే. ఈ కుట్ర కేసులో అరెస్ట్ కాబడిన మేధావులందరి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరియు NI A లు  ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి కరోనా విస్తరిస్తున్న నందున అందరికీ బెయిల్ మంజూరు చేసి వారి జీవించే హక్కును కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
 కరోనా వైరస్ నేపథ్యంలో మహారాష్ట్రలోని జైళ్ల లో కోవిడ్ మరణాలు సంభవిస్తున్న స్థితిలో రాజకీయ ఖైదీలందరిని వెంటనే బెయిలు మరియు పెరోల్ల పై విడుదల చేయాలి.ఆరోగ్యం క్షీణించినా ప్రొఫెసర్ సాయిబాబా వరవరరావు లను వారివారి స్వంత రాష్ట్రలకు పంపించి చికిత్సకు అవకాశం కల్పించాలి. ఖైదీ లందరికి పెరోలు, బెయిల్ తప్పనిసరి చేస్తూ ఖైదీ లందరి జీవించే హక్కు కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తు చేస్తున్నాం. ప్రొఫెసర్ సాయిబాబా తల్లి క్యాన్సర్ తో  చివరి దశలో ఉన్నందున ప్రొఫెసర్ సాయిబాబా కు వెంటనే పెరోలు ఇచ్చి ఇంటికి పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము . యూరోపియన్ దేశాల సబ్ కమిటీ కూడా భీమా కోరేగావ్ కుట్రకేసులోని గౌతమ్ నవలఖా ఆనంద్ తేలుటుంబ్డేలను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేసినారు.ఆమ్నెస్టీ internatinal కూడా భీమా కోరే గావుమ్ కుట్రకేసులోని మేధావులందరిని విడుదల చేయల్డిందిగా ఇదివరకే భారత ప్రభుత్వాన్ని కోరింది.
 ప్రొఫెసర్ సాయిబాబా తోపాటు ప్రశాంత్రాహి,హే మ్ మిశ్రా, పాండు నరోటే,విజయ్ టిక్రి మరియు మహేష్ నరోటే  లను పెరోల్ పై విడుదల చేయాలి.భీమా కోరేగావుమ్ కుట్ర కేసు అనుమానితులైన,వరవరరావు, సుధా భరద్వాజ్, షోమసేమ్,సురేంద్రగాడ్లింగ్, సుధీర్ డావ్లే,మహేష్ రావత్, అరుణ్ పేరారే,రోనావిల్సన్, వెర్నానుగొంజాల్వేస్,గౌతమ్ నవలాఖ మరియు తేలుటుంబ్డే లను వెంటనే బెయిల్ పై విడుదల చేయాలి.
 దేశవ్యాప్తంగా వివిధ జైళ్ళలో అక్రమంగా నిర్బంధించడి మగ్గుతున్న రాజకీయ ఖైదీలందరిని  వెంటనే విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము.
 *ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షుడు,V. రఘునాథ్ ఉపాధ్యక్షుడు,K.రవి ఉపాధ్యక్షుడు,N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,,గుంటి రవి, సహాయ కార్యదర్శి,,మాదన కుమారస్వామి ,సహాయ కార్యదర్శి,,నర్రా పురుషోత్తంరెడ్డి సహాయ కార్యదర్శి,,
అల్గోటే రవీందర్ ,కోశాధికారి,

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy