వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తలొజా జైల్ నుండి ఆయన భార్య కు జైలు అధికారులు ఫోన్ ద్వారా తెలియజేసారు .ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నామని జైల్ అధికారులు తెలిపారు.గత కొంతకాలంగా వరవర రావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సరయిన చికిత్స కోసం కుటుంబ సభ్యులు బెయిల్ కోసం ఎన్ని సార్లు న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా తిరస్కరణ కు గురయింది.ఇప్పటికే వరవరరావు బెయిల్ పిటీషన్ కింది కోర్టు కొట్టేసింది.మహారాష్ట్ర హైకోర్టు లో బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది.భీమా కోరేగావ్ అక్రమ కేసులో వరవరరావు అరెస్ట్ అయ్యారు.