Take a fresh look at your lifestyle.

వందే భారత్‌ ‌వర్సెస్‌..‌భారత్‌ ‌కే బందే

వారు స్మార్ట్‌గా లేకపోవచ్చు. వారు కష్టించి పని చేసేవారు. వారూ భారతీయులే, కానీ, విదేశాల నుంచి వచ్చిన వారిని దేవుళ్లతో సమానంగా చూస్తున్న వేళ వీరి గురించి పట్టించుకున్నవారేరీ. నరేంద్రమోడీ  రెండు సార్లు భారీ మెజారిటీతో గెలుపొంది అధికారంలోకి వచ్చారు. ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చిన పేద ప్రజలు  ఇప్పుడు భారత్‌ ‌కే బందేగా ఉన్నారు. కానీ, నరేంద్రమోడీ పట్ల వారికేమీ కోపం లేదు. ఎన్నికలు వచ్చే సమయానికి వారిని ఎలా ఆకట్టుకోవాలో మోడీకి తెలుసు.

ప్రధాని నరేంద్రమోడీ కొరోనా సందేశం దేశంలో మధ్యతరగతి, ఉన్నత వర్గాల కోసం ఉద్దేశించినట్టిది. దేశంలో కోట్లాది నిరుపేదలకు  అందులో అవసరమైనది, కావల్సింది ఏమీ లేదు. ఆయన సహజసిద్ధమైన శక్తి ఎక్కడుంది. నరేంద్రమోడీ ప్రభుత్వానికి శత్రువులు ఎవరూ లేరు. ఆయన విధానాలనూ, ఆలోచనలను వ్యతిరేకించేవారు లేరు. ఇందుకు తాజా ఉదారణ వందే భారత్‌ ‌మిషన్‌. ‌ప్రస్తుత అస్తవ్యస్త వాతావరణంలో అది ఉత్తేజం కలిగించే అంశం. కొరోనా వైరస్‌ అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బదీసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక కార్యక్రమాలు స్తంభించి పోయాయి. విదేశీయులు అన్ని దేశాల్లో పని చేస్తున్నారు. అలాగే, చదువుల నిమిత్తం  విదేశాలకు వెళ్ళినవారు ఉన్నారు. పర్యాటకులు ఎక్కడికక్కడే చిక్కు బడి పోయారు. వీరిని స్వదేశానికి తీసుకుని రావడానికి ప్రయత్నాలు అన్ని దేశాల్లో జరుగుతున్నాయి. కానీ, మన దేశంలో ప్రధాని మోడీగారు మాత్రం దీనిని ముఖ్యమైన సంఘటన చేసేశారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశం తీసుకుని వచ్చే కార్యక్రమానికి వందే భారత్‌ అనే హ్యాష్‌ ‌టాగ్‌ ‌పెట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ మంత్రిత్వ శాఖలకు ప్రమేయం కల్పించారు. బీజేపీ ఐటి (ఇన్‌ ‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ ) విభాగం ఇందులో ప్రధాన పాత్ర వహిస్తోంది.
టెలివిజన్‌ ‌చానల్స్ ‌సంగతి సరేసరి. ఈ కార్యక్రమానికి అవి విస్తృతమైన ప్రచారం ఇస్తున్నాయి. కన్నార్పకుండా చూసేందుకు వీలుగా  ప్రసారాలను అందిస్తున్నాయి. ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ ‌లేదా స్కార్డు నుంచి విముక్తి సాధించినంత ఆనందంతో మంత్రులతో సహా బీజేపీ నాయకులు కార్యకర్తలు కేరింతలతో తమవారికి స్వాగతం చెప్పారు. అది ఒక ఉత్సవంలా సాగింది. వారు మృత్యుముఖం నుంచి బయటపడ్డారన్నంత ఆనందాన్ని  వ్యక్తం చేశారు. హొటళ్ళలో క్వారంటైన్‌ ‌సౌకర్యాలు కల్పించారు. ఆ ప్రదేశాలనుంచి మేం ఇదంతా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎంతో మంది ప్రవాస భారతీయులను స్వదేశానికి తీసుకుని వచ్చింది. వీరంతా దేవుళ్ళతో సమానంగా  భావించిన వారున్నారు. ఎందుకంటే కొరోనా వైరస్‌ ‌కోరల్లో చిక్కుకోకుండా తిరిగొచ్చారంటే దేవుళ్ళే మరి.

అయితే, ఇక్కడో విషయం చెప్పాలి. బాలీవుడ్‌ ‌నటుడు అక్షయ కుమార్‌ 1990‌లో కువైట్‌ ‌నుంచి వందలాది మంది భారతీయులను వెనక్కి తెచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వగురు కూడా పాలు పంచుకున్నారు. వందే భారత్‌ అం‌దించిన ఉత్తేజం అటువంటిది మరి. దేశంలో పరిస్థితి చూస్తే    45 రోజులుగా ఎక్కడివారు అక్కడ చిక్కుబడిపోయారు. రైళ్ళు లేవు, బస్సులు లేవు. చార్జీలు చెల్లిస్తామన్నా ప్రయాణ సౌకర్యాలు లేవు. వారు స్మార్ట్‌గా లేకపోవచ్చు. వారు కష్టించి పని చేసేవారు. వారూ భారతీయులే, కానీ, విదేశాల నుంచి వచ్చిన వారిని దేవుళ్లతో సమానంగా చూస్తున్న వేళ వీరి గురించి పట్టించుకున్నవారేరీ. నరేంద్రమోడీ  రెండు సార్లు భారీ మెజారిటీతో గెలుపొంది అధికారంలోకి వచ్చారు. ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చిన పేద ప్రజలు  ఇప్పుడు భారత్‌ ‌కే బందేగా ఉన్నారు. కానీ, నరేంద్రమోడీ పట్ల వారికేమీ కోపం లేదు. ఎన్నికలు వచ్చే సమయానికి వారిని ఎలా ఆకట్టుకోవాలో మోడీకి తెలుసు. ఆయన గొప్ప వక్త. మంచి పదాలతో జనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. ఆయన  తాను చాయ్‌ ‌వాలాననీ, అతి సామాన్యుడినని చెబుతారు. విదేశీ విద్యనభ్యసించే అవకాశం రాలేదని చెబుతారు. గాంధీల కుటుంబం మాదిరిగా తనకు  రాజకీయ వారసత్వం లేదని చెబుతారు. గ్రామీణ పేదల కోసం పూర్వపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాది హామీ వంటి పథకాలను చాపచుట్టేసినా ప్రజలు పట్టించుకోరు. గుజరాత్‌ ‌మోడల్‌గా దేశాన్ని అభివృద్ధి చేస్తానంటారు. ఎన్నికల్లో గెలవడానికి అసలైన ప్రముఖులెవరో ఆయనకు తెలుసు.

ప్రజలను ఆకర్షించడానికి ఆయన ఎన్నో ఆకర్షణ పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా దేశ వ్యాప్తంగా  దీపాలు వెలిగించమంటే కోట్లాది మంది వెలిగించారు. వీరిలో ఎంత మందికి సరైన ఆవాసాలు ఉన్నాయి. అగ్గిపెట్టల్లాంటి గదుల్లో కోట్లాది మంది   నివసిస్తున్నారు. ఆ ఇళ్ళకు కిటికీలు కూడా లేవు. వలస కార్మికుల సంగతే తీసుకుంటే వందల మైళ్ళు పనులు కోసం నడిచి వెళ్ళారు. మళ్ళీ అలాగే స్వస్థలాలకు నడిచి వచ్చారు. తిరగొచ్చిన వేలాది మంది వలస కార్మికుల పరిస్థితి ఇది. వారి గురించి మోడీకి తెలుసు. కానీ, విమానాల్లో విదేశాలనుంచి  తిరిగి వచ్చే వారిపైనే ఆయన దృష్టి పెడతారు.

– శేఖర్‌ ‌గుప్త
‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply