Take a fresh look at your lifestyle.

కేరళకు వందేభారత్‌ ‌రైలు

జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

తిరువనంతపురం, ఏప్రిల్‌ 25 : ‌కేరళకు కూడా వందేభారత్‌ ‌భాగ్యం దక్కింది. కేరళలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.  రైలులోని ఓ కోచ్‌ ‌లో  పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ వందే భారత్‌ ‌రైలు తిరువనంతపురం నుంచి కాసరగోడ్‌ ‌వరకు ప్రయాణించనుంది. ఈ రైలు కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్‌, ‌పాలక్కాడ్‌, ‌పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్‌, ‌కన్నూర్‌, ‌కాసరగోడ్‌ 11 ‌జిల్లాలను కవర్‌ ‌చేస్తుంది. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయ్‌ ‌విజయన్‌, ‌రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌ ‌వైష్ణవ్‌ ‌పాల్గొన్నారు.

అంతకుముందు రోడ్‌ ‌షో నిర్వహించిన ప్రధాని మోడీ కేరళ అభివృద్ధి చెందితే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అనేది దేశీయంగా తయారు చేయబడిన సె-హై-స్పీడ్‌ ‌రైలు. ఈ రైలు అత్యాధునికమైన ప్రయాణీకుల సౌకర్యాలను అందిస్తోంది. ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.మోడీ కేరళ పర్యటనలో అసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోడీపై ఎప్పుడూ విమర్శలు చేసే కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ‌స్వయంగా ఎయిర్‌ ‌పోర్టుకు వచ్చి ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. మోడీ కూడా ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు.

Leave a Reply