విశాఖపట్నం,జనవరి11 : వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం రైల్వే స్టేషన్‌కు ఈ రైలును విశాఖకు తీసుకువచ్చారు. ఈ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, 9.30గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సురేష్ తెలిపారు. అందువల్లే వందే భారత్ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలును నిర్వహణ పర్యవేక్షణ నిమిత్తం న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌కు పంపించారు.